గంభీర్‌పై ట్రోల్స్..ఇంగ్లాండ్ గండం గట్టెక్కేదెలా.?
భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి సంచలన విజయాలు, అంతే స్థాయిలో ఊహించని పరాజయాలు.
భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి సంచలన విజయాలు, అంతే స్థాయిలో ఊహించని పరాజయాలు. ఇటీవల ఐర్లాండ్ సిరీస్‌లో ఎదురైన వైట్‌వాష్ పరాజయం, అలాగే సొంతగడ్డపై టెస్ట్ సిరీస్‌లలో ఎదురైన కొన్ని వైఫల్యాల నేపథ్యంలో గంభీర్ కోచింగ్ శైలిపై విమర్శలు ఎక్కువైపోయాయి. కీలక టోర్నమెంట్లు అన్నీ మిస్ అవుతున్నాయని..అసలు గంభీర్ టీమ్ ఇండియా హెడ్ కోచ్‌గా అన్ ఫిట్ అంటూ కొందరు ట్రోల్స్ చేస్తున్నారు. ఇక ఐర్లాండ్ టీమ్ అయితే తాము గంభీర్ లాంటి కోచ్‌ను పెట్టుకోము అంటూ సెటైర్ వేసింది. ఇక ఇంగ్లాండ్ సైడ్ నుంచి కూడా సిరీస్ స్టార్ అయ్యేకంటే ముందు గట్టిగానే సెగ తాకుతోంది.
వైఫల్యాలు Vs ఐసీసీ ట్రోఫీలు
గంభీర్ కోచ్‌గా వచ్చిన తర్వాత ద్వైపాక్షిక సిరీస్‌లలో, టెస్ట్ క్రికెట్‌లో భారత్ కొన్ని ఓటమిని చవిచూసింది. న్యూజిలాండ్, సౌతాఫ్రికాల చేతిలో ఎదురైన ఓటములు, లేటెస్ట్‌గా ఐర్లాండ్ సిరీస్‌లో దారుణ పరాజయం అభిమానులను తీవ్రంగా కలచివేస్తోంది. అయితే కీలక టోర్నమెంట్లు అన్నీ మిస్ అయ్యారనే ఆర్గ్యుమెంట్ పూర్తిగా నిజం కాదు. ఎందుకంటే వైట్‌బాల్ క్రికెట్‌లో గంభీర్ రికార్డు అద్భుతంగా ఉంది. ఆయన కోచింగ్‌లోనే భారత్ అపూర్వ విజయాలను సాధించింది. 2025 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచింది భారత్. 2025 ఆసియా కప్ ఫైనల్లో పాకిస్తాన్‌ను ఓడించి టైటిల్‌ను సొంత చేసుకోగలిగాం. 2026 ఐసీసీ టీ20 వరల్డ్ కప్ కూడా గెలుచుకుని, ఒకే ఏడాదిలో రెండు ఐసీసీ ట్రోఫీలు అందించిన ఘనత గంభీర్ సొంతమైంది. టెస్టుల్లో, చిన్న సిరీస్‌లలో వైఫల్యాలు ఉన్నప్పటికీ..మెగా టోర్నీలలో భారత జట్టు అగ్రెసివ్ మైండ్‌సెట్‌తో రాణించింది.
గంభీర్‌పై ట్రోల్స్‌కు రీజనేంటి.?
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి సీనియర్లు అన్ని ఫార్మాట్లకు దూరం అవుతుండటంతో.. శ్రేయస్ అయ్యర్ వంటి వారికి కెప్టెన్సీ బాధ్యతలు ఇవ్వడం, ప్రతీ మ్యాచ్‌కు ప్రయోగాలు చేయడంతో స్టెబిలిటీ లేదన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. గంభీర్ క్రికెటర్లకు చెప్పే మంత్రం ఒక్కటే. అదేఫియర్ లెస్ క్రికెట్. ఇది టీ20ల్లో అద్భుతంగా వర్కౌట్ అవుతున్నప్పటికీ, వన్డేలు, టెస్టుల్లో వికెట్లు పడిపోవడానికి కారణమవుతోంది. ఇక సరైన కాంబినేషన్ కుదరకపోవడం, కొత్త ప్లేయర్లపై అతిగా ఆధారపడటం ఐర్లాండ్ సిరీస్ లాంటి చోట్ల దెబ్బకొట్టింది. అయితే ఒకటి లేదా రెండు సిరీస్‌లల్లో ఓడిపోవడంతో..గంభీర్‌ను తప్పుబట్టలేమంటున్నారు మరికొందరు ఫ్యాన్స్. గంభీర్ కెరీర్ అంతా ప్రెజర్ ఫేస్తూ విజయాలు సొంతం చేసుకుంటూనే సాగింది. ఈ ఓటముల నుంచి కూడా పాఠాలు నేర్చుకుని జట్టు మళ్లీ పుంజుకునే అవకాశం ఉంది. గంభీర్ మెయిన్ టార్గెట్ 2027 వన్డే ప్రపంచకప్. అప్పటివరకు జట్టును అన్ని ఫార్మాట్లలో నిలకడగా మార్చడమే అతని ముందున్న అసలైన సవాల్. గౌతమ్ గంభీర్ కోచ్‌గా భారత్ కొన్ని షాకింగ్ ఓటములను చూసినా.. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఐసీసీ ట్రోఫీలను కూడా గెలుచుకుంది. టెస్ట్ క్రికెట్‌లో జట్టు స్థిరత్వంపై, అలాగే సిరీస్ సిరీస్‌కు కెప్టెన్లను మార్చే తీరుపై గంభీర్ కాస్త దృష్టి పెట్టాల్సి ఉంది.
సవాల్‌గా ఇంగ్లాండ్ సిరీస్..
ఇంగ్లాండ్ పర్యటన భారత్‌కు ఎప్పుడూ సవాల్‌గానే ఉంటుంది. ఆ టీమ్ స్ట్రాంగ్‌గా ఉండటంతో..దేనినీ లైట్‌గా తీసుకునే పరిస్థితి ఉండదు. ఇప్పుడు ఐర్లాండ్ సిరీస్‌తో ఓటమి తర్వాత టీమిండియా ఇంకా ఒత్తిడి ఎదుర్కోబోతోంది. మంచి యంగ్ టీమ్ ఉన్నప్పటికీ..ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్లను ఫేస్ చేసి..అక్కడి పిచ్‌లకు తగ్గట్లుగా ఆడే బ్యాట్స్‌మెన్ అవసరం. పైగా టాప్ ఆర్డర్ కుప్పకూలితే మిడిల్ ఆర్డర్ నిలబెడితేనే అనుకున్న విజయాలు సాధించొచ్చు. కానీ టీ20 సిరీస్‌లో టీమిండియా పూర్తిగా టాప్-3 బ్యాట్స్‌మెన్ మీదే డిపెండ్ అవుతోంది. ఇక బౌలర్లు కూడా ఆశించినట్లు రాణించట్లేదు. దీంతో గౌతమ్ గంభీర్‌కు ఇంగ్లాండ్ పర్యటన అత్యంత ప్రెస్టేజ్ ఇష్యూగా మారింది. యంగ్ ప్లేయర్లను విదేశీ పరిస్థితులకు తగ్గట్టుగా సిద్ధం చేయడం, కఠినమైన పిచ్‌లపై బ్యాటింగ్ లైనప్‌ను గాడిన పెట్టడం అతనికి పెద్ద పరీక్షగా నిలిచింది. జట్టును నడిపించడం, వ్యూహాత్మకంగా సరైన నిర్ణయాలు తీసుకోవడం గంభీర్ ముందున్న పెద్ద టాస్క్. ఇంగ్లాండ్ పేస్, స్వింగ్ బౌలింగ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొనేలా ఆటగాళ్లను మానసికంగా ప్రిపేర్ చేయాల్సిన అసవరం ఉంది. ఈ సవాళ్లను ఎదుర్కొని ఇంగ్లాండ్ సిరీస్‌లో టీమిండియా ఎలా సత్తా చాటుతుందనేది ఉత్కంఠగా మారింది.