యూత్ సెంట్రిక్‌గా నారా లోకేష్ అడుగులు.. !

రాజ‌కీయాల్లో యువ‌త‌కు ప్రాధాన్యం ఇచ్చే దిశ‌గా టీడీపీ యువ నాయ‌కుడు, మంత్రి నారాలోకేష్ అడుగులు వేస్తున్నారు.

Update: 2026-07-01 00:30 GMT

రాజ‌కీయాల్లో యువ‌త‌కు ప్రాధాన్యం ఇచ్చే దిశ‌గా టీడీపీ యువ నాయ‌కుడు, మంత్రి నారాలోకేష్ అడుగులు వేస్తున్నారు. ఇప్ప‌టికే పార్టీలో యువ‌త‌కు ప్రాధాన్యం పెంచారు. ఇక‌పై మ‌రింత‌గా యువ‌త‌ను చేర్చుకునేదిశ‌గా ఆయ‌న ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ క్ర‌మంలోనే డిగ్రీ చ‌ద‌విన యువ‌త‌కు రాజ‌కీయాల్లోకి రావాలంటూ పిలుపునిచ్చారు. ఇది చాలా కీల‌క విష‌యం. ఎందుకంటే.. స‌హ‌జంగా డిగ్రీ చ‌దివిన వారు ఉద్యోగం, ఉపాధి చూసుకుంటున్నారు.

అలాంటివారిని రాజ‌కీయాల్లోకి ఆహ్వానించ‌డం.. వారికి రాజ‌కీయాల‌పై అవ‌గాహ‌న క‌ల్పించే దిశ‌గా అడుగు లు వేయ‌డం వంటివి నారా లోకేష్ ఎంచుకున్న కీల‌క వ్య‌వ‌హార‌మేన‌ని చెప్పారు. దీనికి ప్ర‌ధాన కార‌ణం.. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ప‌రిస్థితి ఎలా ఉన్నా.. ఆ పై 2034 నాటికి చాలా మంది సీనియ‌ర్లు రిటైర‌య్యే అవ‌కాశం ఉంది. ఇదేస‌మయంలో వార‌స‌త్వ రాజ‌కీయాలు తెర‌మీదికి వ‌స్తున్నాయి. అయితే.. వార‌సుల కంటే కూడా.. ఎలాంటి రాజ‌కీయ ప్రాదాన్యం లేని వారికి అవ‌కాశం క‌ల్పించాల‌ని చూస్తున్నారు.

పార్టీలోను, ప్ర‌భుత్వంలోనూ యువ‌త ఎక్కువ‌గా ఉంటే.. అందునా చ‌దువుకున్న వారు ఎక్కువ‌గా ఉంటే.. ప్ర‌భుత్వం ప‌నితీరు పార‌ద‌ర్శ‌కంగా ఉంటుంద‌న్న విష‌యంపై ప‌క్కా క్లారిటీతో ఉన్నారు. ప్ర‌స్తుతం యువ మంత్రులుగా ఉన్న‌వారి ప‌నితీరును దీనికి ఉదాహ‌ర‌ణ‌గా తీసుకుంటున్నారు. అందుకే.. భ‌విష్య‌త్తును దృష్టిలో పెట్టుకుని యువ‌త‌కు ప్రాధాన్యం ఇవ్వాల‌ని మంత్రి లోకేష్ చూస్తున్నారు. త‌ద్వారా కార్యక‌ర్త‌ల కొర‌త కూడా త‌గ్గుతుంది.

ప్ర‌స్తుతం దేశంలోనే అతి పెద్ద ప్రాంతీయ పార్టీగా టీడీపీ ఉంది. నిన్న మొన్న‌టి వ‌ర‌కు టీఎంసీ ఉన్నా.. బెంగాల్‌లో అధికారం పోయిన ద‌రిమిలా.. ఆ పార్టీ కార్య‌క‌ర్త‌లు చీలిపోయారు. ఆ త‌ర్వాత డీఎంకే రెండో స్థానంలో ఉంది. అది కూడా ఇప్పుడు ఇబ్బందుల్లో చిక్కుకుంది. దీనికి కార‌ణం.. సంస్థాగ‌తంగా కార్యక‌ర్త‌ల‌ను డెవ‌ల‌ప్ చేసుకోక‌పోవ‌డ‌మేన‌ని తెలుస్తోంది. అందుకే.. నారా లోకేష్‌యూత్ సెంట్రిక్‌గా త‌న రాజ‌కీయాల‌ను పెంచుతున్నారు. ఇది స‌క్సెస్ అయితే.. యువ‌త‌కు అపార అవ‌కాశాలు ల‌భిస్తాయి.

Tags:    

Similar News