ఎన్డీయేకు తెదేపా గుడ్‌ బై!! అశోక్ - సుజనా రాజీనామా!

Update: 2018-03-07 17:31 GMT
కేంద్రంలోని తెలుగుదేశం పార్టీమంత్రులిద్దరూ రాజీనామా చేస్తారని ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ప్రకటించారు. కేంద్రం ఏపీకి సహాయం చేసే ఉద్దేశంలో లేదని అర్ధమైందని.. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. తమ పార్టీ ఎంపీలు - ఎమ్మెల్యేలు - ఎమ్మెల్సీలు అంతా ఈ నిర్ణయానికి ఆమోదం పలికినట్లు చెప్పారు. కేంద్రంతో ఎంత సయోధ్యగా ఉన్నప్పటికీ - ఎంత సహకారంగా ఉన్నప్పటికీ కేంద్రం తమను పట్టించుకోలేదని.. రాష్ట్రానికి ప్రయోజనం కలుగుతుందని కేంద్ర కేబినెట్లో ఉన్నామని.. కానీ, ఆ ప్రయోజనాలు సిద్ధించనందున ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.
    
ప్రధానికి దీనిపై సమాచారం ఇచ్చేందుకు మర్యాద పూర్వకంగా ప్రయత్నం చేసినా ఆయన లైన్లో దొరకలేదని.. దీంతో తమ మంత్రులకు రాజీనామా చేయాలని సమాచారం ఇచ్చినట్లు చంద్రబాబు తెలిపారు.
    
కాగా అంతకుముందు ఎంపీలతో టెలీకాన్ఫరెన్స్ లో అందరూ తెగతెంపులు చేసుకోవాలని సూచించారు.  ప్రస్తుతం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతున్నారు. అది ముగిసిన తరువాత కేంద్రంలోని ఇద్దరు టీడీపీ మంత్రులు అశోక్ గజపతి రాజు - సుజనా చౌదరిలు రేపు తమ పదవులుకు రాజీనామా చేయనున్నారు.
Tags:    

Similar News