అధికార అండతో చెలరేగిపోయిన వారందరూ ఇప్పుడు జైలు ఊసలు లెక్కబెడుతున్నారు. యూపీఏ హయాంలో కేంద్రమంత్రులుగా కాంగ్రెస్ లో వెలుగు వెలిగిన చిదంబరం కానీ డీకే శివకుమార్ కానీ ఇప్పుడు జైలు పాలయ్యారు. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ అదే పరిస్థితి. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రభుత్వంలో మోనార్క్ లా వ్యవహరించిన దెందలూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కూడా ఇప్పుడు కటకటాల పాలయ్యారు. నాడు ఫిర్యాదు చేసినా అధికార అండతో.. చంద్రబాబు పుష్కలమైన సపోర్టుతో కేసుల్లో ఇరుక్కోకుండా రెచ్చిపోయిన చింతమనేనికి ఇప్పుడు శ్రీకృష్ణ జన్మస్థానం ఖాయంగా కనిపిస్తోందట..
టీడీపీ నేత - మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ చేసిన అక్రమాలు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్కటొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చింతమనేని చేసిన అక్రమాలపై ఫిర్యాదులు చేయడానికి వెనుకాడిన వారు ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం రావడంతో ధైర్యంగా పోలీస్ స్టేషన్ కు క్యూ కడుతున్నారు. కేసుల మీద కేసులు పెడుతూ ఫిర్యాదులు చేస్తున్నారు.
టీడీపీ ప్రభుత్వ హయాంలో కనీసం 50 కేసులు నమోదైనా చింతమనేనిపై చంద్రబాబు ఈగవాలనివ్వలేదు. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం రావడంతో బాధితులు అంతా బయటకొచ్చి ఫిర్యాదులు చేస్తున్నారు. ఆ 50 కేసులు బయటకు తీసిన పోలీసులు.. ఇప్పుడు మరిన్ని ఫిర్యాదులు రావడంతో వాటన్నింటిని నమోదు చేస్తున్నారు. దాదాపు సెంచరీ కేసులు చింతమనేనిపై నమోదయ్యేలా కనిపిస్తున్నాయట..
ప్రస్తుతానికి 66 కేసులతో ముందుకెళుతున్న చింతమనేని ఇప్పటికైతే 25వ తేదీ వరకు రిమాండ్ లో ఉన్నారు. తాజా కేసులతో ఆయన రిమాండ్ పొడగించే అవకాశాలున్నాయి. ఇక ఓ కేసులో రెండేళ్ల శిక్ష కూడా పడింది. దీంతో చింతమనేని రాజకీయ జీవితం కేసులతోనే జైల్లోనే అంతమయ్యే పరిస్థితులున్నాయా అన్న అనుమానాలు కూడా సాగుతోంది. ఇంత మంది బయటకు వచ్చి ఫిర్యాదులు చేస్తున్నా చింతమనేని మాత్రం పోలీసులతో దురుసుగానే ప్రవర్తిస్తున్నాడట.. నోటిదురుసుతో తిడుతున్నాడట.. ‘చింత’చచ్చినా పులుపు చావడం లేదంటే ఇదేనేమో..