• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  టీడీపీ, వైసీపీలు ప్రాంతీయ...

టీడీపీ, వైసీపీలు ప్రాంతీయ పార్టీలు మాత్రమే

By - Tupaki Desk
Update: 2021-09-25 06:30 GMT
తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు అండ్ కో ఎంతమాత్రం జాతీయ పార్టీగా క్లైం చేసుకునేందుకు లేదు. ఎందుకంటే టీడీపీ కేవలం ప్రాంతీయ పార్టీ మాత్రమే అని కేంద్ర ఎన్నికల కమిషన్ స్పష్టం గా ప్రకటించింది. తమ పార్టీకి జాతీయ పార్టీ అని చెప్పుకునేంత సీన్ లేదని చంద్రబాబు అండ్ కోకు బాగా తెలుసు. అయినా కమిషన్ గుర్తింపును పట్టించుకోకుండా తమకు తాము తమ పార్టీని జాతీయ పార్టీగా ప్రకటించేసుకున్నారు టీడీపీ నేతలు.

జాతీయ పార్టీగా ప్రకటించేసుకోవటమే కాకుండా ఏకంగా జాతీయ అధ్యక్షుడిగా తనను తాను చంద్రబాబు నియమించేసుకోవటమే విచిత్రం. టీడీపీ కమిటీల్లో రెండు రకాలు కమిటీలున్నాయి. టీడీపీ జాతీయ అధ్యక్షునిగా చంద్రబాబు వ్యవహరిస్తుంటే రాష్ట్ర అధ్యక్షుడిగా కింజరాపు అచ్చెన్నాయుడు ని ప్రకటించారు. అలాగే జాతీయ పార్టీకి, రాష్ట్ర పార్టీకి వేర్వేరుగా ప్రధాన కార్యదర్శులను, జాయింట్ సెక్రటరీలను, ఉపాధ్యక్షులను, సభ్యులను కూడా చంద్రబాబు ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే.

తాము కేవలం ప్రకటించుకోవటమే కాకుండా ఈ మేరకు వేర్వేరుగా లెటర్ హెడ్లు కూడా ప్రింట్ చేసి ఉపయోగించుకుంటున్నారు. పార్టీ శాలను ఇతర రాష్ట్రాల్లో ఏర్పాటు చేసినంత మాత్రాన టీడీపీ జాతీయ పార్టీ అయిపోదు. పార్టీ సాధించిన ఓట్లు, సీట్లను బట్టే సదరు పార్టీ జాతీయ పార్టీయా లేకపోతే ప్రాంతీయ పార్టీయా అని కేంద్ర ఎన్నికల కమిషన్ డిసైడ్ చేస్తుంది. ఈ ప్రాతిపదికన టీడీపీ ప్రాంతీయ పార్టీ మాత్రమే అని గతంలోనే కమిషన్ ప్రకటించింది.

అయినా కమిషన్ ప్రకటనను పట్టించుకోకుండా టీడీపీని జాతీయ పార్టీగా చంద్రబాబు ప్రకటించేసుకోవటమే విచిత్రం. టీడీపీ ఏర్పాటైన దగ్గర నుండి ఇప్పటివరకు ఇతర రాష్ట్రాల్లో ఎక్కడా అసెంబ్లీ, పార్లమెంటుకు  పోటీచేయలేదు. కాబట్టి జాతీయ పార్టీగా చెప్పుకునేందుకు లేదు. ఇదే సమస్య వైసీపీ కూడా ఎదురవుతోంది. కాకపోతే టీడీపీ-వైసీపీ మధ్య ఓ తేడా ఉంది. అదేమిటంటే వైసీపీ కూడా తమది జాతీయపార్టీయే అని చెప్పుకుంటున్నా అది కేవలం చెప్పుకోవటానికి మాత్రమే పరిమితమైంది.

టీడీపీ లాగ వైసీపీ జాతీయ కమిటీ, ప్రాంతీయ కమిటీలని రెండు కమిటీలను ప్రకటించలేదు. లెటర్ హెడ్లు, సోషల్ మీడియా వేదికల్లో మాత్రమే చెప్పుకుంటున్నారు వైసీపీ నేతలు. ఎంఐఎం పరిస్థితి కూడా సేమ్ టు సేమ్. కాకపోతే టీడీపీ, వైసీపీ కన్నా ఎంఐఎం చాలా మేలనే చెప్పాలి. ఎందుకంటే మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, గుజరాత్, బీహార్, తమిళనాడు రాష్ట్రాల్లో పోటీచేసింది. మహారాష్ట్రలో ఇద్దరు, బీహార్లో ఐదుగురు ఎంఎల్ఏలున్నారు ఎంఐఎంకి. రేపు ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో కూడా పోటీచేయటానికి రెడీ అవుతోంది. జాతీయ పార్టీగా చెప్పుకోవటమే కాకుండా నిజమైన జాతీయపార్టీగా ఎదిగేందుకు గట్టిగా ప్రయత్నాలూ చేస్తోంది.
Tags:    
  • Ap Cm Jagan Mohan Reddy 
  • Ycp Party 
  • andhra pradesh 
  • Chandra Babu Naidu 
  • TDP 
  • Political News 
  • Telugu Desam Party 
  • Nara lokesh 

Similar News

మూడు ముళ్ల బంధం.. రూ. 7.50 లక్షల కోట్ల వ్యాపార సామ్రాజ్యం!

2026-11-19 19:30 GMT

వీఐపీలు వస్తేనే ముంబైకి అందం.. సామాన్యులు ఉంటే ఎందుకీ దుర్గంధం?

2026-11-19 18:30 GMT

సహచరుల వద్ద తలెత్తుకోలేకపోతున్నా.. ఇప్పుడే వైసీపీలోకి వెళ్లిపోండి! – టీడీపీ ఎమ్మెల్యే థామస్ సంచలన వ్యాఖ్యలు

2026-11-19 17:30 GMT

AI హడావుడి.. సినిమాకు ఒరిగిందేంటి!

2026-11-19 17:30 GMT

పార్టీలు, ఫంక్షన్లు జరగాలంటే ఆ రూల్స్ పాటించాలా?

2026-11-19 16:30 GMT

చంద్రబాబు దెబ్బకు తమిళనాడులో అలజడి!? ఏపీకి డేటా లీక్, 15 మందిపై వేటు! నిజమేనా?

2026-11-19 15:30 GMT

ఆ ఒక్క తప్పు చేస్తే మళ్లీ కష్టాలే : ప్రధాని మోదీ హెచ్చరిక.. తినడం, తిరగడం, తాగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-19 14:30 GMT

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

Copyright @2026

Powered by Blink CMS