ముంతాజ్ కు తలసాని వార్నింగ్.. ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడు

Update: 2020-11-23 03:30 GMT
ఆటలో అరటిపండు అంటే దీన్నే అంటారేమో? ఓవైపు టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా గ్రేటర్ ఎన్నికలు సాగుతున్న వేళ.. గులాబీ పార్టీకి మిత్రుడైన మజ్లిస్ అధినేత అసద్ కు అత్యంత విధేయుడైన ఎమ్మెల్యే ముంతాజ్ ఖాన్ నోటి నుంచి వచ్చిన సంచలన వ్యాఖ్యలు పెద్ద ఎత్తున కలకలం రేపుతున్నాయి. ఇప్పటివరకు మిత్రులుగా ఉన్న వారు.. హటాత్తుగా ఏమైందో అన్న చందంగా.. మంత్రి కేటీఆర్ మీదా.. టీఆర్ఎస్ సర్కారుపై సంచలన వ్యాఖ్యలు చేయటం తెలిసిందే.

చార్మినార్ ఎమ్మెల్యే చేసిన సంచలన వ్యాఖ్యలకు భారీగా రియాక్టు అయ్యారు మంత్రి తలసాని. తాము తలుచుకుంటే టీఆర్ఎస్ సర్కారును రెండు నెలల్లో పడగొడతాన్న కీలక వ్యాఖ్యతో పాటు.. మంత్రి కేటీఆర్ ను చిన్న పిల్లాడిగా తీసిపారేస్తూ.. అతడి వయసు ఏమిటి? మజ్లిస్ రాజకీయ చరిత్ర ఏమిటి? అంటూ ప్రశ్నించారు. మంత్రి కేటీఆర్ ను ఉద్దేశించి ముంతాజ్ చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు తలసాని.

మీరెంత? మీ పార్టీ ఎంత? మీరా.. మా ప్రభుత్వాన్ని కూలగొట్టేది.. ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని ముంతాజ్ ఖాన్ కు సీరియస్ వార్నింగ్ ఇచ్చేశారు తలసాని. కేటీఆర్ బచ్చానో.. బడానో.. ఆయన రోడ్ షోకు వస్తున్న జనాల్ని చూస్తుంటే తెలుస్తుందన్న తలసాని.. పాతబస్తీ డెవలప్ మెంట్ కోసం కేటీఆర్ చుట్టూ తిరిగినప్పుడు ఆయన ఏ స్థాయి నేత అన్న విషయం ముంతాజ్ ఖాన్ కు తెలీదా? అని ప్రశ్నించారు.

రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినంతనే మజ్లిస్ ట్రాప్ లోకి తాము పడమన్న తలసాని..అసెంబ్లీలో ఎవరి బలం ఏమిటో ప్రజలకు తెలుసని.. ఏడు సీట్లు ఉన్న మజ్లిస్ ప్రభుత్వాన్ని పడగొడుతుందన్న మాటను కామెడీగా అభివర్ణించారు తలసాని. ఇదిలా ఉంటే.. మజ్లిస్ నేత ఘాటు విమర్శపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్ సైతం స్పందించారు. కాంగ్రెస్ ను దెబ్బ తీయటానికి బీజేపీతో మజ్లిస్ జత కట్టిందన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. మీ తాత.. ముత్తాత వచ్చినా టీఆర్ఎస్ ను ఏం చేయలేరంటూ మజ్లిస్ నేతకు ఘాటు కౌంటర్ ఇచ్చారు.
Tags:    

Similar News