USలో తెలుగు విద్యార్థి అరెస్ట్, కారణం ఇదే..!
ఇండియా నుంచి ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లే విద్యార్థుల్లో కొందరు అక్కడ నేరాలకు పాల్పడి జైలు పాలు అవుతుంటే, కొందరు రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందుతున్నారు.;
ఇండియా నుంచి ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లే విద్యార్థుల్లో కొందరు అక్కడ నేరాలకు పాల్పడి జైలు పాలు అవుతుంటే, కొందరు రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందుతున్నారు. కొందరు స్థానికుల చేతుల్లో హత్యలకు గురి అవుతున్నారు. అమెరికాకు వెళ్లే ఇండియన్స్‌లో తెలుగు వారు మెజార్టీ శాతం ఉంటారు అనే విషయం తెల్సిందే. యూఎస్‌లో ఉండే ఇండియన్స్ గురించి రెగ్యులర్‌గా ఏదో ఒక వార్త మీడియాలో చూస్తూనే ఉంటాం. ఇటీవల అమెరికాలో ఉండే తెలుగు వ్యక్తి కి లైంగిక వేధింపుల కేసులో ఏకంగా 20 ఏళ్ల జైలు శిక్ష పడ్డ విషయం తెల్సిందే. అమెరికాలో శిక్షలు చాలా కఠినంగా ఉంటాయని, ముఖ్యంగా లైంగిక వేధింపుల నేరాలకు అత్యంత కఠినంగా శిక్షలు ఉంటాయి అని తెలిసి కూడా కొందరు అక్కడ కళ్లు మూసుకుని నేరాలకు పాల్పడటం, శిక్ష అనుభవించడం కామన్ అయ్యింది.
ఏపీ కుర్రాడికి అమెరికాలో శిక్ష...
అమెరికాలోని మిచిగాన్‌లో ఏపీకి చెందిన నవ కుమార్ తుపిలి లైంగిక వేదింపుల కేసులో అరెస్ట్ అయ్యాడు. అక్కడ ఇమిగ్రేషన్ అధికారులు అరెస్ట్ చేశారు. మైనర్లపై లైంగిక వేధింపులకు పాల్పడట్లుగా నిరూపితం కావడంతో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతే కాకుండా ఆన్ లైన్ ద్వారా మోసాలకు పాల్పడ్డాడు అని కూడా ఆరోపణలు ఉన్నాయి. కంప్యూటర్ ను ఉపయోగించి అక్కడ నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయి. నవ కుమార్ అక్కడ చట్ట విరుద్దంగా ఆన్ లైన్ మోసాలకు పాల్పడ్డట్లుగా చెబుతున్నారు. దాంతో నవ కుమార్ కు గరిష్టంగా పాతిక సంవత్సరాల పాటు జైలు శిక్ష పడే అవకాశాలు ఉన్నాయని ఎన్నారై వర్గాల వారు అంటున్నారు. చదువుకోవడానికి వెళ్లి ఇవేం పనులు అంటూ పలువురు నవ కుమార్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నవ కుమార్ తుపిలి వీసా రద్దు...
ఇప్పటికే నవ కుమార్ తుపిలి వీసాను రద్దు చేసి చట్ట పరమైన చర్యలు మొదలు పెట్టినట్లుగా అమెరికన్ పోలీసులు పేర్కొన్నారు. నేరారోపణలు కారణంగా ఐసీఈ అదుపులోకి తీసుకోబడిందని కూడా వారు చెబుతున్నారు. స్టూడెంట్ వీసాపై అమెరికా వెళ్లిన నవ కుమార్ వీసా రద్దు చేయడం జరిగింది. గతంలోనూ నవ కుమార్ పై నేరారోపణలు ఉన్నాయి. కనుక ఈసారి ఆయనకు కఠిన శిక్ష పడే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. 2024 లోనే ఇతడు నేరాలకు పాల్పడ్డట్లుగా రికార్డ్‌లు ఉన్నాయి. ఇప్పటికే ఇతడిపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. అతి త్వరలోనే నవ కుమార్ కి కోర్ట్ శిక్షను ఖరారు చేసే అవకాశాలు ఉన్నాయంటూ స్థానికులు చెబుతున్నారు. చిన్న వయసులోనే ఇలా జైలు పాలు కావడం అతడి కుటుంబ సభ్యులకు తీవ్ర శోఖం ను మిగిల్చింది.
ఇండియన్ గవర్నమెంట్...
ఇలాంటి కేసుల్లో ఎలాంటి చర్చలకు కూడా ఇమ్మిగ్రేషన్ అధికారులు అనుమతి ఇవ్వరు. అలాగే ఇండియన్ ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అందదు. అక్కడ తెలియక చేసిన తప్పుకు జైలు శిక్ష పడితే ఏమైనా ప్రభుత్వాలు చర్చలు జరిపి ఇండియా కు రప్పించే అవకాశాలు ఉంటాయి. కానీ ఇలాంటి లైంగిక వేధింపుల కేసుల్లో ప్రభుత్వం కూడా ఎలాంటి సహకారం అందించే వీలు లేదు. ఇలాంటి లైంగిక వేధింపులకు పాల్పడిన నేరస్తులను కాపాడ వద్దు అని కూడా చాలా మంది డిమాండ్ చేస్తున్నారు. ఇండియా నుంచి వెళ్లి అక్కడ నేరాలకు పాల్పడుతూ ఇండియా పరువు తీస్తున్న ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలంటూ కొందరు డిమాండ్ చేస్తున్నారు. మరి కొందరు మాత్రం నవ కుమార్ కి మద్దతుగా నిలుస్తున్నారు. తెలియక చేసిన తప్పుగా కొందరు మాట్లాడుకుంటున్నారు.