వైఎస్సార్సీపీలోకి అఖిలప్రియ మేనమామ!

Update: 2019-03-16 14:47 GMT
మంత్రి అఖిలప్రియ మేనమామ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇన్నాళ్లూ ఆమె వెంట నిలిచిన మేనమామల్లో ఒకరైన ఎస్వీ జగన్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అఖిలప్రియ మేనమామల్లో ఒకరైన ఎస్వీ మోహన్ రెడ్డి ఫిరాయింపు ఎమ్మెల్యేగా ఉన్న సంగతి తెలిసిందే. ఆయన తిరిగి కర్నూలు నుంచి పోటీ చేయాలనే ప్రయత్నంలో ఉన్నారు. జగన్ పార్టీ తరఫున నెగ్గిన ఆయన ఫిరాయించిన సంగతి తెలిసిందే.
 
అయితే చంద్రబాబు నాయుడు ఎస్వీ మోహన్ రెడ్డికి టికెట్ ఇస్తారా ఇవ్వరా.. అనేది ఆసక్తిదాయకంగా మారింది. కర్నూలు సీటు విషయంలో పంచాయితీ కొనసాగుతూ ఉంది. తొలి జాబితాలో ఆ నియోజకవర్గం గురించి స్పష్టతను ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు. రెండో జాబితాలో ఆ నియోజకవర్గం నుంచి అభ్యర్థి ప్రకటన ఉంటుందని అంటున్నారు. టికెట్ విషయంలో ఎస్వీ మోహన్ రెడ్డిలో ఆందోళన నెలకొన్నట్టుగా ఉంది.

టికెట్ తమకే ఖరారు అయ్యిందని టీజీ కుటుంబం ప్రచారం చేసుకుంటోంది. ఈ మేరకు టీజీ వెంకటేష్ ప్రకటించుకున్నారు కూడా. తన తనయుడికి కర్నూలు ఎమ్మెల్యే టికెట్ ఖరారు అయ్యిందని ఆయన ప్రకటించుకున్నారు. దీంతో ఎస్వీ మోహన్ రెడ్డి పరిస్థితి ప్రస్తుతానికి గందరగోళంలో ఉంది.

అఖిలప్రియ మేనమామల్లో ఒకరైన ఎస్వీ మోహన్ రెడ్డి పరిస్థితి అలా ఉంటే.. మరో మేనమామ ఎస్వీ జగన్ రెడ్డి మాత్రం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. జగన్ ఆధ్వర్యంలో ఆ పార్టీలో చేరిపోయారాయన. నంద్యాల- ఆళ్లగడ్డ రాజకీయం అప్పుడే అయిపోలేదని.. ఈ వారంలోనే మరిన్ని హాట్ అప్ డేట్స్ ఉన్నాయని తెలుస్తోంది.

నంద్యాల ఎమ్మెల్యే టికెట్ భూమా బ్రహ్మానందరెడ్డికి దక్కే అవకాశాలు తక్కువగా ఉన్నాయట. ఈ విషయంలో ఆయన అసహనంతో ఉన్నారని స్పష్టం అవుతోంది. ఇప్టపికే అనుచరులతో సమావేశం ఏర్పాటు చేసి.. టికెట్ దక్కకపోతే ఇండిపెండెంట్ గా పోటీనే అని ఆయన ప్రకటించారు కూడా!
Tags:    

Similar News