ఇంజనీరింగ్ ఫీజులపై సుప్రీం సంచలన తీర్పు
చదువులు ఖరీదు అయిపోయాయి. మన చిన్నప్పుడు ప్రభుత్వ పాఠశాల ఒక్కటే ఊళ్లో ఉండేది. ఇప్పుడు ఆ ప్రభుత్వ వ్యవస్థ నిర్వీర్యమైపోయి ప్రైవేటు కార్పొరేట్ విద్యావ్యవస్థ పెచ్చరిల్లింది. సామాన్య, మధ్యతరగతి సంపాదనంతా స్కూలు ,కాలేజీ ఫీజుల పేరిట లాగేస్తున్నారు.
నర్సరీకే 30వేల ఫీజు.. పదోతరగతి లక్షకు పై మాటే.. ఇంజనీరింగ్ ఫీజులు చెప్పే పరిస్థితి లేదు. ఇప్పుడు స్కూలు ఫీజులకే విద్యార్థుల తల్లిదండ్రులకు గుదిబండగా మారాయి. తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదలైన వేళ ఫేమస్ ఇంజనీరింగ్ కాలేజీలు ఫీజులను ఇటీవల డబుల్ చేశాయి. హైదరాబాద్ లోని ప్రముఖ ఇంజినీరింగ్ కాలేజీలైన సీబీఐటీ 3 లక్షలకు చేరువగా ఫీజును పెంచగా.. శ్రీనిధి, వాసవి లాంటి కాలేజీలు 2.50లక్షలకు వరకు ఫీజులను పెంచాయి. అయితే ప్లేసుమెంట్స్, చదువు, నాణ్యత గల ఈ కాలేజీలు అత్యధిక ఫీజులను పెంచడంపై విద్యార్థుల తల్లిదండ్రులు, తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకెక్కింది. ఫీజులు భారీగా పెంచడం కుదరదని.. అన్ని కాలేజీల వల్లే నియంత్రణ ఉండాలని కోరాయి. అయితే వీరి పిటీషన్ ను తెలంగాణ హైకోర్టు తోసిపుచ్చింది. ఫీజులను పెంచుకునేందుకు ఆయా కాలేజీలకు స్వేచ్చనిచ్చింది.
తాజాగా విద్యార్థుల తల్లిదండ్రుల కమిటీ, తెలంగాణ ప్రభుత్వం ఇంజనీరింగ్ ఫీజుల నియంత్రణపై సుప్రీంకోర్టుకెక్కాయి. వాదనలు విన్న సుప్రీం హైకోర్టు తీర్పును పక్కనపెట్టేసింది. ఇలా వ్యవహరించడం సరికాదని హితవు పలికింది. తెలంగాణ ఫీజుల నియంత్రణ, సీట్ల భర్తీ సంస్థనే ఫీజులను నియంత్రిస్తుందని.. కాలేజీలన్నీ ఆ ఫీజులనే పాటించాలని తాజాగా తీర్పునిచ్చింది.
ఇంజనీరింగ్ ఫీజులను లక్షలలు పెంచిన శ్రీనిధి, వాసవి కాలేజీలకు సుప్రీం తీర్పు ఎదురుదెబ్బగా మారింది. ఇప్పుడు ఈరెండు కాలేజీలే కాదు.. మిగతా కాలేజీలు సైతం తెలంగాణ ఫీజుల నియంత్రణ కమిటీ నిర్ణయించిన ఫీజులనే తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సుప్రీం తీర్పు విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఊరటనిచ్చింది.