• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఏపీ బీహార్ రాష్ట్రాలపై...

ఏపీ బీహార్ రాష్ట్రాలపై సుప్రీం ఆగ్రహం.. సీఎస్ కు పిలుపు

By - Tupaki Desk
Update: 2022-01-19 08:06 GMT
కరోనా పరిహారం చెల్లింపులో జాప్యంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు. ఈ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ తోపాటు బీహార్ సీఎస్ కు కూడా సమన్లుజారీ చేసింది. ఇవాళ మధ్యాహ్నం 2 గంటల్లోగా తమ ముందు హాజరు కావాలని ఆదేశించింది.

కోవిడ్ పరిహారం చెల్లింపులో జాప్యంపై ఇవాళ విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఎంఆర్ షా, సంజీవ్ ఖన్నాలతో కూడిన ధర్మాసనం ఇరు రాష్ట్రాల సీఎస్ లు ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టుకు హాజరుకావాలని స్పష్టం చేసింది. వారు చట్టానికి అతీతులు కాదని హితవు పలికింది.

కోవిడ్ తో మృతిచెందిన వారి కుటుంబ సభ్యులకు ఎక్స్ గ్రేషియా పరిహారం చెల్లింపు కోసం మార్గదర్శకాలను రూపొందించాలని  జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ(ఎన్.డీఎంఏ)ని జూన్ 30, 2021న సుప్రీంకోర్టు ఆదేశించింది. ఎక్స్ గ్రేషియా సాయంగా అందించాల్సిన మొత్తాన్ని నిర్ణయించే బాధ్యతను ఎన్డీఎంఏ విజ్ఞతకే వదిలివేసింది కోర్టు.

అనంతరం కోవిడ్19 మృతుల కుటుంబాలకు రూ.50000 నష్టపరిహారం చెల్లించాలని సిఫారసు చేసినట్లు పేర్కొంటూ కేంద్రప్రభుత్వం సుప్రీంకోర్టు ముందు అఫిడవిట్ దాఖలు చేసింది.

మరణించిన వారి బంధువులకు రూ.50వేలు చెల్లించాలని కేంద్రం చేసిన సిఫార్సును కోర్టు అక్టోబర్ 2021లో ఆమోదించింది. అయితే పరిహారం చెల్లింపులో జాప్యంతో సుప్రీంకోర్టుకు చేరింది. దీనిపై సీరియస్ అయిన సుప్రీంకోర్టు తక్షణం సుప్రీంకోర్టు ముందు హాజరు కావాలని ఆదేశించింది. చట్టానికి ఎవరూ అతీతులు కాదని ఏపీ, బీహార్ సీఎస్ లకు ఆదేశించింది.
Tags:    
  • andhra pradesh 
  • andhra pradesh government 
  • Andhra Pradesh Economy 
  • AP Sarkar 
  • Covid 19 
  • Supreme Court 

Similar News

పార్టీలు, ఫంక్షన్లు జరగాలంటే ఆ రూల్స్ పాటించాలా?

2026-11-19 16:30 GMT

చంద్రబాబు దెబ్బకు తమిళనాడులో అలజడి!? ఏపీకి డేటా లీక్, 15 మందిపై వేటు! నిజమేనా?

2026-11-19 15:30 GMT

ఆ ఒక్క తప్పు చేస్తే మళ్లీ కష్టాలే : ప్రధాని మోదీ హెచ్చరిక.. తినడం, తిరగడం, తాగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-19 14:30 GMT

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

Copyright @2026

Powered by Blink CMS