• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  భూ సమస్యలకు పరిష్కారం...

భూ సమస్యలకు పరిష్కారం ఇదేనా..?

By - Tupaki Desk
Update: 2021-10-07 05:28 GMT
ఒకరికి సంబంధించి భూములు మరికొరికి వెళ్లడం..నిషేధిత భూముల్లో పట్టాలు రావడం.. ఎప్పుడో విక్రయించి భూములు వారి పేరిటే నమోదు కావడం, తదితర భూ సమస్యలతో తెలంగాణ ప్రజలు కొట్టుమిట్టాడుతున్నారు. అయితే భూ సమస్యలకు పరిష్కార వేదిక ఒక్కటేనని ప్రభుత్వం ధరణి వెబ్ సైట్ ను అందుబాటులోకి తెచ్చింది. కానీ ఇందులో నమోదైన వివరాలన్నీ తప్పుల తడకగా సూచిస్తున్నాయి. తమకు అందుబాటులో ఉన్న సమాచారాన్ని మాత్రమే ధరణి వెబ్ సైట్లో అప్లోడ్ చేశారని, చాలా వరకు అవి తప్పులుగానే నమోదయ్యయని ఫిర్యాదులు వెల్లువెత్తున్నాయి. కొందరు ధరణి అధారంగా చేసుకొని విక్రయించిన భూములు తమవేనని ఆందోళన చేస్తున్నార. మరోవైపు నిషేధిత భూముల్లో పట్టాలు రావడంతో ఆ భూములుపై పట్టు పెంచుకుంటున్నారు.

భూ సమస్యలు పరిష్కారం కోసం ధరణి వెబ్ సైట్ పరిష్కారమని ప్రభుత్వం చెప్పింది. కానీ ఇందులో అనేక తప్పులు నమోదు కావడంతో ఇప్పడు ఇదే సమస్యగా మారింది. ఇందుకు ప్రతి రోజు కలెక్టర్ల ఆపీసులకు వస్తున్న ఫిర్యాదులే కారణం. ప్రతి రోజు ఎమ్మార్వో కార్యాలయానికి భూ సమస్యపై ఒక ఫిర్యాదు అందుతూనే ఉంది. ఈ నేపథ్యంలో  తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావు నేతృత్వంలో ఏర్పాటైన ఉపసంఘం కీలకాంశాలపై దృష్టి పెట్టాలని భూ చట్టాల నిపుణులు అంటున్నారు. కంప్యూటర్ రికార్డులో లోపాలు ఉంటే మాన్యువల్ రికార్డులను ఆధారం చేసుకోవాలని అంటున్నారు.

2004 నుంచి భూరికార్డుల కంప్యూటరీకరణ మొదలైంది. అయినా ఇప్పటికీ భూ సమస్యలు తీరడం లేదు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక నిర్వహించిన భూ సర్వే లో కొందరు తమకు అందుబాటులో ఉన్న ఆధారాలతోనే వివరాలను నమోదు చేశారు. అంతకుముందున్న గ్రామ పహాణీలను వారు పట్టించుకోలేదు. వెబ్ ల్యాండ్, భూ రికార్డుల ప్రక్షాళన యాప్, మా భూమి పోర్టల్ ఆధారంగానే వారు ధరణిలో వివరాలను నమోదు చేశారు. దీంతో గ్రామ పహాణి ప్రకారం చూస్తే ఆ వివరాలకు పొంతన లేదు. దీంతో సమస్యలు తీరడం లేదు.

అయితే ఈ సమస్య పరిష్కారానికి మరోసారి భూ సర్వే నిర్వహించాల్సిన అవసరం ఉందంటున్నారు. కాలానుగుణంగా వస్తున్న మార్పులకు భూ సమస్య పరిష్కారానికి ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేసి రెండేళ్లకోసారి భూ సవరణ రికార్డులను ప్రక్షాళన చేయాలని అంటున్నారు. మాన్యువల్ రికార్డులను క్షేత్రస్థాయి రికార్డులతో పోల్చి చూసి ఆ తరువాతే వివరాలు పక్కాగా నమోదు చేయాలి. అయితే ఇందుకు భూ సర్వేనే పరిష్కారమంటున్నారు.

ప్రస్తుతం ధరణి వ్యవస్థ ప్రకారం భూ సంబంధిత ఫిర్యాదులను కలెక్టర్లే పరిష్కరించాలి. అయితే కలెక్టర్లు ఒక్క నిషేధిత భూముల విషయంలో మాత్రమే టైటిళ్లు ఇచ్చేందుకు చట్టబద్ధత ఉందని భూ రికార్డుల నిపుణులు అంటున్నారు. భూ రికార్డలు చట్టంలోనే కలెక్టర్లకు అధికారం లేనప్పుడు వారెలా ఈ సమస్యలు పరిష్కరిస్తారని అంటున్నారు. అంతకుముందు మ్యుటేషన్ పై తహసీల్దార్లకు, రికార్డుల్లో తప్పుల సవరణకు ఆర్డీవోకు మాత్రమే అధికారం ఉండేది. కానీ ఇప్పుడు ఈ అధికారాన్ని తహసీల్దార్లకు మాత్రమే అప్పగించారు. ఇలాంటి సమయంలో కలెక్టర్లు సమస్య పరిష్కారం కోసం చొరవ చూపినా అది పనిచేయదని అంటున్నారు.

2007లో భూ రికార్డుల ప్రక్షాళన పేరిట 100 రోజుల ప్రణాళిక చేపట్టారు. మరోసారి ఇలాంటి ప్రణాళికతో సమస్య కొంత వరకు పరిష్కారం అయ్యే అవకాశం ఉందని కొందరు భూ రికార్డుల నిపుణులు అంటున్నారు. అలాగే గ్రామాల్లోని పహాణిని ఆమోదం పొంది దానిని రికార్డుగా ఏర్పరచాలి..భూ వివాదానికి డివిజినల్, జిల్లా స్థాయిలో అధికారులను ఏర్పాటు చేయాలి.. జిల్లా స్థాయిలో రెవెన్యూ కోర్టులు ఏర్పాటు చేయాలి. భూ యాజమాన్య హక్కులకు సంబంధించిన కేసులు సివిల్ కోర్టులకు మాత్రమే పంపే ప్రయత్నం చేయాలని భూ రికార్డుల నిపుణులు సూచిస్తున్నారు.
Tags:    
  • Land Survey 
  • Land Problems 
  • Land Issues 
  • Land Solutions 
  • Dharani Portal 
  • telangana land Cases 

Similar News

పిచ్చికుక్క కరిచిందా.. ఎర్రగడ్డకు పంపిస్తాం.. కోమటిరెడ్డికి రేవంత్ రెడ్డి పరోక్ష పంచ్.. కాంగ్రెస్‌లో మాటల మంటలు

2026-11-19 21:30 GMT

విశాఖ నుంచి తిరుపతి వెళ్ళే భక్తులకు సూపర్ న్యూస్

2026-11-19 21:15 GMT

సీనియర్లను రంగంలోకి దించిన జనసేన

2026-11-19 21:15 GMT

ఎవరు గెలిచినా మేమే...వైసీపీ అలా తృప్తి పడుతోందా ?

2026-11-19 21:12 GMT

మంత్ర్రుల‌ను కాద‌న‌లేరు.. కార్య‌క‌ర్త‌ల‌ను వ‌ద్ద‌న‌లేరు: బాబుకు చిక్కులు

2026-11-19 21:12 GMT

పెరిగే సీట్లు వైసీపీ రాజకీయాన్ని ముంచేస్తాయా ?

2026-11-19 21:11 GMT

మలేషియా గేట్లు మూసేసింది.. భారతీయులకు ఇక వీసా కష్టాలు.. అసలు కారణమిదే..

2026-11-19 21:10 GMT

కొలువు తీరిన ఎంపీపీలు...రికార్డు స్థాయిలో పదవులు

2026-11-19 21:01 GMT

మోదీ ప్రస్తావించిన లైసెన్స్ రాజ్ అంటే ఏమిటి? ఏంటా కథ?

2026-11-19 21:00 GMT

'రాష్ట్ర పండుగ' గా రామోజీరావు జయంతి.. ..ప్రభుత్వ నిర్ణయంపై భిన్న వాదనలు ఇవే !

2026-11-19 20:57 GMT

మూడు ముళ్ల బంధం.. రూ. 7.50 లక్షల కోట్ల వ్యాపార సామ్రాజ్యం!

2026-11-19 19:30 GMT

వీఐపీలు వస్తేనే ముంబైకి అందం.. సామాన్యులు ఉంటే ఎందుకీ దుర్గంధం?

2026-11-19 18:30 GMT

Copyright @2026

Powered by Blink CMS