ప్రాణాలు తీసిన పిక్నిక్​.. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు బలి

Update: 2020-11-18 03:45 GMT
పిక్నిక్​ సరదా ఓ కుటుంబంలో తీరని విషాదం నింపింది. సరదాగా హాలిడే ట్రిప్​కు వెళ్లిన ఆ కుటుంబంలోని ఐదుగురు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదకర సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి తన ఆరుగురు కుటుంబసభ్యులతో కలిసి ఆటోలో రహత్​గర్​ వాటర్​ఫాల్స్​ వద్దకు వచ్చాడు. అయితే  జలపాతాల వద్ద కాసేపు సరదాగా గడిపిన కుటుంబసభ్యులు.. ఆ తర్వాత వంటలు చేసుకొనేందుకు నిషేధిత ప్రాంతానికి వెళ్లారు. అయితే అక్కడ వరద ఉధృతి ఎక్కువగా రావడంతో ఆరుగురు కుటుంబసభ్యులు కొట్టుకుపోయారు.

గమనించిన స్థానికుడు వీరిని కాపాడేందుకు ప్రయత్నించి నీటిలోకి దూకాడు.  ఒక వ్యక్తిని మాత్రం కాపాడి ఒడ్డుకు చేర్చగలిగాడు. మిగిలిన కుటుంబసభ్యులంతా నీటిలో మునిగిపోయారు. సమాచారం అందుకుని సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అగ్నిమాపక సిబ్బంది,  స్థానికుల సహాయంతో వాటర్ ఫాల్స్ లో జరిగిన గాలింపు చేపట్టారు. నలుగురు మృతదేహాలను ఒడ్డుకు చేర్చారు.

 మృతుల్లో ఇద్దరు చిన్నారులు, ఇద్దరు మహిళలు ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.వాటర్ ఫాల్స్ వద్ద కొన్ని ప్రాంతాల్లో కి వెళ్లేందుకు నిషేధించడం జరిగిందని, ఆ కుటుంబం నిషేధిత ప్రాంతంలోకి వెళ్లడం వల్లే వారు ప్రాణాలు కోల్పోయారని పోలీసులు తెలిపారు. లాక్​డౌన్​ నిబంధనలు సడలించడంతోపాటు కరోనాపై ప్రజల్లో భయం తగ్గిపోయింది. దీంతో చాలా మంది టూర్లు, హాలిడే ట్రిప్​లకు తిరుగుతున్నారు. అయితే జలపాతాల సందర్శనకు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలని నిషేధిత ప్రాంతాలకు వెళ్లొద్దని పోలీసులు సూచిస్తున్నారు.
Tags:    

Similar News