షాక్ ... కోవాగ్జిన్ తీసుకున్న వలంటీర్ మృతి..!
భారత్‌లో త్వరలోనే వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభిస్తారని ప్రభుత్వం ప్రకటించింది. సీరం ఇన్స్టిట్యూట్ రూపొందించిన ఆస్ట్రాజెనికా.. భారత్ బయోటెక్ తయారుచేసిన కోవాగ్జిన్ అత్యవసర పంపిణీని భారత ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే కోవాక్జిన్ మూడో దశ ట్రయల్స్ పూర్తికాకుండానే అనుమతి ఇచ్చారని ఆరోపణలు వెల్లువెత్తాయి. అయినప్పటికీ ప్రభుత్వం వ్యాక్సిన్ పంపిణీ చేపట్టునుందని చెప్పింది. ఈ నేపథ్యంలో ఓ వార్త ప్రజలను తీవ్ర కలవరపాటుకు గురిచేస్తుంది. ఇటీవల ఈ వ్యాక్సిన్ తీసుకున్న ఓ వలంటీర్ మృతిచెందాడు. అయితే అతడు వ్యాక్సిన్ తీసుకోవడం వల్లే మృతిచెందాడా? లేక ఏదైనా ఇతర సమస్యల వల్ల మృతిచెందాడా? అన్న విషయంపై ఇంకా క్లారిటీ లేదు.
హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ అనే సంస్థ కోవాగ్జిన్‌ను తయారు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌లో భాగంగా., భోపాల్‌కు చెందిన దీపక్ మరవి (42)కి వ్యాక్సిన్ ఇచ్చారు. గత ఏడాది డిసెంబర్ 12న పీపుల్స్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్‌లో అతడికి కోవాక్జిన్ డోస్ ఇచ్చారు. అయితే సరిగ్గా పదిరోజుల తర్వాత దీపక్ ప్రాణాలు కోల్పోయాడు.
ఈ విషయంపై మెడికల్ కళాశాల వైస్ చాన్స్‌లర్ ఏమన్నారంటే.. ‘దీపక్‌కు మేము కోవాగ్జిన్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే అతడు విషప్రయోగం వల్ల చనిపోయాడని భావిస్తున్నాం. ఈ విషయంలో మరిన్ని పరీక్షలు జరగాల్సి ఉందని చెబుతున్నారు.
అయితే డిసెంబర్ 12న అతడు వ్యాక్సిన్ తీసుకోగా డిసెంబర్ 21న ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ప్రస్తుతం కోవాగ్జిన్ పై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ విషయంపై ఇంతవరకు భారత్ బయోటెక్ యాజమాన్యం స్పందించలేదు. కుటుంబసభ్యులు మాట్లాడుతూ.. ‘డిసెంబర్ 12న దీపక్ కోవాగ్జిన్ తీసుకున్నాడు. ఇంటికి వచ్చినప్పటి నుంచి అతడు అనారోగ్యంతోనే ఉన్నాడు. అయితే డిసెంబర్ 17న అతడు కొంత అస్వస్థతకు గురయ్యాడు. మేము ఆస్పత్రికి తీసుకెళ్తామని చెప్పాం. కానీ అతడు వినలేదు. చివరకు డిసెంబర్ 21న అతడు ప్రాణాలు కోల్పోయాడు. అతడి నోట్లోనుంచి నురుగు వచ్చింది. ఎలా చనిపోయాడో అర్థం కావడం లేదు’ అని కుటుంబసభ్యులు అంటున్నారు.