ఈడీ ఆఫీసుకు బీజేపీ బ్యానర్ కట్టిన శివసేన

Update: 2020-12-29 11:32 GMT
మహారాష్ట్రలో బీజేపీ వర్సెస్ అధికార శివసేన మధ్య పంచాయితీ ముదిరి పాకాన పడుతోంది. ఇప్పటికే మాటల యుద్ధం పీక్ స్టేజీకి చేరుకోగా.. తాజాగా ప్రతీకార చర్యలు మొదలయ్యాయన్న చర్చ సాగుతోంది.

తాజాగా బీజేపీ అంటేనే ఒంటికాలిపై లేచే శివసేన ఎంపీ సంజయ్ రౌత్ భార్య వర్షా రౌత్ కు కేంద్రంలోని ఈడీ సమన్లు జారీ చేయడంపై శివసైనికులు సోమవారం మండిపడ్డారు. ఏకంగా ఈడీ కార్యాలయం ఎదుట ‘బీజేపీ ప్రదేశ్ కార్యాలయ్’ అని బ్యానర్ ఏర్పాటు చేశారు.శివసేన భవన్ ఎదుట భారీ సంఖ్యలో పోగైన మహిళలు ఈడీ, బీజేపీలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

సంజయ్ రౌత్ సోమవారం విలేకరుల సమావేశంలో బీజేపీపై ఘాటుగా విమర్శలు గుప్పించారు.  బీజేపీ ఈడీ ద్వారా తమపై ఒత్తిడి తీసుకొచ్చి మహా వికాస్‌ ఆఘాడీ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేస్తుందని రావుత్‌ ఆరోపించారు. సంవత్సర కాలం నుంచి తమను బెదిరిస్తూ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర పన్నుతున్నారని ధ్వజమెత్తారు. అందుకు ఈడీ, సీబీఐ అస్తాన్ని ప్రయోగిస్తున్నారని ఆరోపించారు. ఒక్క ఏడాదిలోనే రాష్ట్రంలో శరద్ పవార్, ప్రపుల్ పటేల్, ఏక్ నాథ్ ఖడ్సే, ప్రతాప్ సర్నాయిక్ తదితరులకు ఈడీ నుంచి నోటీసులు జారీ అయ్యాయని గుర్తు చేశారు.

శివసేన, ఎన్సీపీలకు చెందిన 22 మంది ఎమ్మెల్యేల జాబితాను రౌత్‌ చూపించారు. వీరందరికీ నోటీసులు జారీ చేసి ఆ తరువాత అరెస్టు చేస్తామంటూ బెదిరించడమేగాకుండా ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసేలా కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు.

శివసేన ఎంపీ సంజయ్ రౌత్ భార్యకు ఈడీ నోటీసులు రాజకీయ కక్షతోనే చేస్తున్నారని.. మేం కేసులకు భయపడమని శివసేన సీఎం ఉద్దవ్ కుమార్ ఆధిత్య ఠాక్రే వ్యాఖ్యానించారు
Tags:    

Similar News