• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  కేసీఆర్‌ ను క‌న్వీన్స్...

కేసీఆర్‌ ను క‌న్వీన్స్ చేయ‌లేనంటున్న డిప్యూటీ సీఎం

By - Tupaki Desk
Update: 2017-07-16 06:51 GMT
తెలంగాణ ముఖ్య‌మంత్రి కే చంద్రశేఖరరావు త‌న‌లోని ఉగ్ర న‌ర‌సింహుడి రూపాన్ని సొంత ఎమ్మెల్యేపైనే ప్ర‌ద‌ర్శిస్తున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌హ‌బూబాబాద్‌కు చెందిన ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌ తీరుపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంకా గుర్రుగానే ఉన్నారు. రెండు రోజులపాటు వ్యక్తిగతంగా సీఎం అపాయింట్‌ మెంట్‌ కోసం శంకర్‌ నాయక్‌ ప్రయత్నించినా ఆయన నిరాకరించడంలో ఇందులో భాగ‌మ‌ని అంటున్నారు. త్వ‌ర‌లో ఆయ‌నపై సీఎం కేసీఆర్ వేటు వేయ‌డం ఖాయ‌మ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఈ నెల 12వ తేదీన మహబూబాబాద్‌ లో మూడో విడత హరితహారం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌ - మహిళా కలెక్టర్‌ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన విషయం తెల్సిందే. దీనిపై ఎమ్మెల్యే క్షమాపణ చెప్పాలని ఐఏఎస్‌ లు సీఎంను కలిశారు. ఇదే విషయమై వివరణ ఇచ్చేందుకు మహబూబాబాద్‌ ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌ శుక్రవారం ముఖ్యమంత్రి కేసీఆర్‌ ను కలిసేందుకు ఎర్రవల్లి గ్రామంలోని సీఎం ఫాం హౌస్‌ కు వెళ్లారు. అయితే సీఎం అపాయింట్‌ మెంట్‌ ఇవ్వలేదు. దీంతో ప్రధాన గేటు వద్ద భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. అపాయింట్‌ మెంట్‌ లేకుండా లోపలికి అనుమతి లేదని శంకర్‌ నాయక్‌ కు తేల్చిచెప్పారు. దీంతో ఆయన హైదరాబాద్‌ కు తిరిగి వెళ్లారు. శనివారం నేరుగా ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి చేరుకున్నా సీఎం అపాయింట్‌ మెంట్‌ దొరకలేదు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన శంకర్‌ నాయక్‌ క్యాంపు కార్యాలయం నుంచి సచివాలయానికి వచ్చి సీఎం పబ్లిక్‌ రిలేషన్‌ ఆఫీసర్‌ (పీఆర్‌ ఓ) కార్యాలయంలో కూర్చున్నారు. అక్కడనుండి ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరిని కలుసుకున్నారు. క్షమాపణ చెప్పినా తనపై సీఎం ఇంకా ఆగ్రహంగా ఉన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలిసింది. జిల్లా కలెక్టర్‌ పట్ల తాను అమర్యాదగా ప్రవర్తించలేదని, అయినా తనపై కేసు నమోదు చేయించడం ఏమిటని కడియంను ప్రశ్నించినట్టు తెలిసింది.

అయితే ఈ విషయంలో కడియం కూడా చేతులెత్తేసినట్టు సమాచారం. ముఖ్యమంత్రి కేసీఆర్‌ చెప్పిన వెంటనే క్షమాపణ చెప్పకుండా ఆలస్యం చేయడం, ఆ తర్వాత తన తప్పేమీ లేదని మీడియాతో మాట్లాడటం సరికాదు అని చెప్పినట్టు తెలిసింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి పర్యవేక్షిస్తున్నారని, ఇందులో తాను జోక్యం చేసుకోలేనని కడియం సమాధానం ఇచ్చినట్టు సమాచారం. ఈ కేసులో టీఆర్‌ ఎస్ పార్టీ నుండి శంకర్‌ నాయక్‌ ను సస్పెండ్‌ చేస్తారని అధికారపార్టీ వర్గాలు  అంటున్నాయి. విచారణ అనంతరం ఆయనపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం లేకపోలేదని జోరుగా ప్ర‌చారం సాగుతోంది.
Tags:    
  • Shankar Naik 
  • Kadiyam Srihari 
  • Telugu News 

Similar News

పార్టీలు, ఫంక్షన్లు జరగాలంటే ఆ రూల్స్ పాటించాలా?

2026-11-19 16:30 GMT

చంద్రబాబు దెబ్బకు తమిళనాడులో అలజడి!? ఏపీకి డేటా లీక్, 15 మందిపై వేటు! నిజమేనా?

2026-11-19 15:30 GMT

ఆ ఒక్క తప్పు చేస్తే మళ్లీ కష్టాలే : ప్రధాని మోదీ హెచ్చరిక.. తినడం, తిరగడం, తాగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-19 14:30 GMT

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

Copyright @2026

Powered by Blink CMS