మోడీకి మాజీ అధికారుల సంచలన లేఖ

Update: 2021-07-19 07:34 GMT
దేశంలో రిటైర్ అయ్యాక అధికారులకు అందేది పింఛన్ మాత్రమే. ఆ పింఛన్ పై ఆధారపడి ఆ వృద్ధులు తమ భవిష్యత్ జీవితాన్ని ఆనందంగా గడిపేస్తారు. అయితే తాజాగా మోడీ సర్కార్ ‘పెన్షన్ నిబంధనల మార్పులు’ చేస్తూ నిర్ణయం తీసుకుంటుంది. దీనిపై పింఛన్ దారులైన మాజీ అధికారులు ఆవేదన ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీకి 109మంది మాజీ సివిల్ సర్వెంట్స్ గ్రూప్ ఘాటుగా లేఖ రాసింది. ఈ మేరకు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి.

మోడీ తీసుకొచ్చిన పెన్షన్ నిబంధనలు తమను ఆశ్చర్యానికి గురిచేశాయని.. అలాగే తీవ్ర మనస్థాపానికి గురయ్యేలా చేశాయని ఆ లేఖలో పేర్కొన్నారు.  మే 31వ తేదీ 2021న మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్, పబ్లిక్ గ్రీవాన్స్ అండ్ పెన్షన్ నోటిఫై చేసిన పింఛన్ నిబంధనలు తమను ఆవేదనకు గురిచేయడంతోపాటు ఆశ్చర్యానికి గురిచేసినట్లు వాళ్లు లేఖలో పేర్కొన్నారు.

ఇంటెలిజెన్స్, సెక్యూరిటీ సంస్థల్లో పనిచేసి రిటైర్ అయిన ఉద్యోగులు ఏదైనా పబ్లిష్ చేయాలనుకుంటే ఆ సంస్థ అధిపతి నుంచి క్లియరెన్స్ తీసుకోవడాన్ని తాజా సవరణ తప్పనిసరి చేసింది. అసలు ఈ నిబంధన ఎందుకు తీసుకువచ్చారో అర్థం కావడం లేదని పేర్కొన్నారు.

మోడీ సర్కార్ తెచ్చిన నిబంధనల వల్ల తమకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని.. పెన్సన్ రద్దు చేసేలా చేసేలా నిబంధనలు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.

నిబంధనలు మార్చినప్పుడు అంశాలను పరిగణలోకి తీసుకోలేదని వారు ఆరోపించారు. 2008లోనేూ ఇలానే యూపీఏ రా, ఐబీ లాంటి వాటిల్లో ఈ ఉత్తర్వులు ప్రవేశపెట్టారని ఆరోపించారు.
Tags:    

Similar News