సింగపూర్ ఆస్పత్రిలో సీనియర్ లీడర్.. పరిస్థితి విషమం
ప్రముఖ సమాజ్ వాదీ పార్టీ నాయకుడు అమర్ సింగ్ పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిసింది. ఆయన చాలా నెలల నుంచి సింగపూర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
సింగపూర్ ఆస్పత్రిలో ఆయన వెంట భార్య పంకజా.. ఆయన ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్న అమర్ సింగ్ ఆరోగ్య పరిస్థితి అత్యంత క్లిష్టంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. సింగపూర్ లోని భారత రాయబార కార్యాలయం అమర్ సింగ్ కుటుంబానికి మద్దతుగా నిలుస్తోంది.
2013లో మూత్రపిండాల వైఫల్యంతో అమర్ సింగ్ దుబాయ్ లో చికిత్సపొందాడు. అప్పుడు కూడా ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నప్పటికీ కోలుకున్నారు. 2016లో తిరిగి యాక్టివ్ పాలిటిక్స్ లోకి వచ్చాడు.
ప్రస్తుతం సీరియస్ గా ఉన్న అమర్ సింగ్ ఆరోగ్యం కుదుటపడాలని అభిమానులు కోరుతున్నారు. ఇటీవలే అమర్ సింగ్ ఒక వీడియో రిలీజ్ చేసి అభిమానులతో పంచుకున్నారు.