తొలిసారి మీడియాతో మాట్లాడిన ఐబొమ్మ కాదు కాదు ఇమంది రవి!

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ ఏడాది అత్యంత సంచలనంగా మారిన వ్యవహారాల్లో ఐబొమ్మ, బెప్పం అనే పైరసీ సినిమాల వెబ్ సైట్స్ నిర్వహణలో కింగ్ పిన్ గా చెబుతున్న ఇమంది రవి కేసు ఒకటనే సంగతి తెలిసిందే;

Update: 2025-12-29 12:51 GMT

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ ఏడాది అత్యంత సంచలనంగా మారిన వ్యవహారాల్లో ఐబొమ్మ, బెప్పం అనే పైరసీ సినిమాల వెబ్ సైట్స్ నిర్వహణలో కింగ్ పిన్ గా చెబుతున్న ఇమంది రవి కేసు ఒకటనే సంగతి తెలిసిందే. పోలీసులకు సవాల్ చేయడం.. అనంతరం అతన్ని వారు అరెస్ట్ చేయడం.. ఈ సందర్భంగా ఇండస్ట్రీ మొత్తం హైదరాబాద్ పోలీసులకు థాంక్స్ చెప్పడం.. దీనికి సంబంధించిన వరుస ఎపిసోడ్ లు అటు మీడియాలోనూ, ఇటు సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్ గా మారిన పరిస్థితి.

ఈ క్రమంలో తాజాగా రవికి న్యాయస్థానం విధించిన 12 రోజుల పోలీసు కస్టడీ ముగిసింది. ఈ కస్టడీలో కీలక వివరాలను సైబర్ క్రైమ్ పోలీసులు సేకరించారని అంటున్నారు. ఈ సందర్భంగా... తన బ్యాంక్ లావాదేవీలను అతని ముందుంచే విచారించారని తెలుస్తోంది. ఇక ప్రహ్లాద్ అనే వ్యక్తి డాక్యుమెంట్లను రవి దొంగిలించాడని.. అతని పేరు మీదే రవి పాన్ కార్డు, లైసెన్స్ తీసుకున్నాడని అంటున్నారు. ఈ క్రమంలో అరెస్టైన తర్వాత తాజాగా తొలిసారి మీడియాతో మాట్లాడారు రవి!

అవును... తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనంగా మారిన ఐబొమ్మ కేసులో ప్రధాన నిందితుడిగా చెబుతోన్న ఇమంది రవి.. అరెస్ట్ తర్వాత తొలిసారిగా మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా... తన పేరు ఇమంది రవి అని.. ఐబొమ్మ రవి కాదని.. ఐబొమ్మ తనదే అని మీకు ఎవరు చెప్పారని స్ట్రాంగ్ గా రియాక్ట్ అయిన రవి... తనపై వస్తోన్న ఆరోపణలన్నీ అవాస్తవాలని.. బెట్టింగ్ యాప్స్ తో తనకు సంబంధాలున్నాయని ఎవరు చెప్పారని ప్రశ్నించారు. ఏదైనా కోర్టులోనే తేల్చుకుంతా అని తెలిపారు.

ఇదే సమయంలో... తాను ఎక్కడికీ పారిపోలేదని.. వేరే దేశంలో సిటిజన్ షిప్ మాత్రమే తీసుకున్నానని.. తాను కూకట్ పల్లిలోనే ఉన్నానని.. ఏదైనా కోర్టులోనే తేల్చుకుంటానని.. తనపై వచ్చిన ఆరోపణలన్నీ అసత్యాలని.. సరైన సమయంలో వాస్తవాలు బయటపెడతానని ఇమంది రవి వెల్లడించారు.

బొమ్మ రవిది.. వివరాలు ప్రహ్లాద్ వి!:

ఐబొమ్మ కేసులో కీలక నిందితుడిగా ఉన్న రవి కేసులో ఇటీవల బిగ్ ట్విస్ట్ నెలకొన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... బెంగళూరుకు చెందిన ప్రహ్లాద్‌ అనే సాఫ్ట్‌ వేర్‌ ఇంజినీర్‌ గుర్తింపును దొంగిలించి.. అతడి పేరుతో ఆధార్, పాన్, డ్రైవింగ్‌ లైసెన్సును రవి పొందాడని చెబుతున్నారు. పోలీసుల కస్టడీలో ఉన్న సమయంలో రవిని విచారించినప్పుడు ఈ విషయం వెలుగులోకి వచ్చింది! కిట్స్ అండ్ నేవిస్ దేశ పౌరసత్వం కూడా ప్రహ్లాద్ వివరాలతోనే పొందినట్లు చెబుతున్నారు.

Tags:    

Similar News