మనిషి మరణాన్ని పోస్ట్ పోన్ చేసే పరిశోధన ఇది

Update: 2016-08-10 05:54 GMT
పన్ను పోతే కొత్త పన్ను వస్తుంది. అది కూడా ఒక్కసారి మాత్రమే. అది మినహా మిగిలిన మరే అవయుం కూడా పాత దాని స్థానంలో కొత్తది తయారు కావటం ఉండదు. కొన్ని హాలీవుడ్ సినిమాల్లో మాత్రం ప్రత్యర్థులు భారీగా దాడులు చేసి.. శరీరాన్ని ఛిద్రం చేసేసినా.. క్షణాల్లో కొత్తగా శరీరం వచ్చేయటం సినిమాల్లో చూస్తుంటాం. మరీ అంతలా కాకున్నా.. శరీరంలో ఏదైనా అవయువం చెడితే.. దానిస్థానేకొత్త అవయవాన్ని వృద్ధి చేసుకునేలా టెక్నాలజీ అందుబాటులోకి వస్తే.. వైద్యరంగంలోనే సరికొత్త సంచలనంగా మారటమే కాదు.. మనిషి ఆయువు కూడా అంతకంతకు పెరిగిపోవటం ఖాయం.

మరి.. ఈ విప్లవాత్మకమైన మార్పు దిశగా సైంటిస్ట్ లు ఇప్పుడు అడుగులు వేస్తున్నారు. జీబ్రా ఫిష్.. అక్సోలాట్ లాంటి చేపలకు ఒక ప్రత్యేకత ఉంది. అదేమంటే.. తనకు అవసరమైతే శరీర అవయువాల్ని తమకు తామే వృద్ధి చేసుకుంటాయి. ఇంకాస్త అర్థం అయ్యేలా చెప్పుకోవాలంటే బల్లుల తోకల్ని.. వాటికవే తయారుచేసుకుంటున్న తరహాలో అన్న మాట.

కొన్ని జాతుల చేపల్లో ఉండే ఈ అరుదైన నైపుణ్యాన్ని మనిషి కూడా అందిపుచ్చుకుంటే అన్న ఆలోచనలో పరిశోధనలు సరికొత్తగా సాగనున్నాయి. అనారోగ్యానికి గురైన మనిషి అవయువాల్ని.. ఈ కొత్త సాంకేతికతతో తమకు తామే కొత్త అవయువాల్ని తయారు చేసుకోగలిగితే.. అదో సంచలనంగా మారుతుంది. దీనికి సంబంధించిన జన్యు నియంత్రణ వ్యవస్థల్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ నియంత్రణలను అధిగమించేలా చేయగలిగితే.. భవిష్యతులో మనిషి కూడా తనకు అవసరమైన అవయువాల్ని తనకు తానే వృద్ధి చేసుకోగలుగుతాడన్న మాట. ఈ పునర్ సృష్టి దిశగా శాస్త్రవేత్తలు తాజాగా పరిశోధనలు చేస్తున్నారు. అవి కానీ సక్సెస్ అయితే.. ఒక అద్భుతం ఆవిష్కృతమైనట్లే. ఆ రోజు ఎప్పటికి అందుబాటులోకి వస్తుందో చూడాలి.
Tags:    

Similar News