ఉక్కిరిబిక్కిరితో ఊపిరి ఆడటం లేదట
గ్రేటర్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావటం తెలిసిందే. గడిచిన కొద్ది రోజులుగా ఎన్నికల నోటిఫికేషన్ మీద పెద్ద ఎత్తున చర్చ సాగటమే కాదు.. పలు అంశాలు ప్రచారంలోకి వచ్చాయి. ఎన్నికలు డిసెంబరు 4న అని కొందరు.. 6న అని మరికొందరు అని చెబితే.. అందుకు భిన్నంగా డిసెంబరు ఒకటిన ఎన్నికల పోలింగ్ జరుగుతుందన్న ఎన్నికల సంఘం ప్రకటన రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెర తీసింది.
ఎన్నికల ప్రక్రియ చాలా వేగంగా సాగేట్లుగా ఉండటంపైనా విపక్షాలు గుర్రుగా ఉన్నాయి. షెడ్యూల్ వెలువడిన పక్క రోజు నుంచి నోటిఫికేషన్ జారీ కావటం.. నామినేషన్ల ప్రక్రియకు కేవలం మూడు రోజులు మాత్రమే సమయం ఇవ్వటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. నోటిపికేషన్ కు సమయం ఉందన్న సమాచారంతో రాజకీయ పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. ఉన్నట్లుండి విరుచుకుపడిన కుమ్యులో నింబస్ మేఘాల మాదిరి.. ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్ ఉందంటున్నారు.
ఎన్నికలపై అధికారపక్షం సర్వసన్నద్ధంగా ఉంటే.. విపక్షాలు ఇంకా సిద్ధం కాలేదు. తాజా షెడ్యూల్ ను చూసినప్పుడు సమయం పెద్ద అవరోధంగా కనిపించక మానదు. తాజాగా తెలంగాణ ఎన్నికల సంఘం అనుసరించిన పద్దతిని పలువురు తప్ప పడుతున్నారు. నిబంధనలకు విరుద్ధమని చెప్పట్లేదు కానీ.. సాధారణంగా ఎన్నికల షెడ్యూల్ కు.. నోటిఫికేషన్ కు మధ్య రోజుల వ్యవధి ఉండేలా చూడటం ఆనవాయితీగా వస్తుందని చెబుతున్నారు. కేంద్ర ఎన్నిక సంఘం ఈ సంప్రదాయాన్ని తప్పక పాటిస్తుందని.. అందుకు భిన్నంగా రాష్ట్ర ఎన్నికల సంఘం తీరు ఉందన్న మాట వినిపిస్తోంది.
మూడండే మూడు రోజులు మాత్రమే నామినేషన్లకు అవకాశం ఇవ్వటం.. మరోవైపు టీఆర్ఎస్ ఇప్పటికే కసరత్తు పూర్తి చేసి సిద్ధంగా ఉంటే.. బీజేపీ.. కాంగ్రెస్ లు ఇప్పుడిప్పుడే వార్మప్ పూర్తి చేస్తున్న వేళలో.. ఏకంగా ఎన్నికల ఆటలోకి దిగాల్సిన రావటం గమనార్హం. అతి తక్కువ సమయంలో ప్రతిష్ఠాత్మకంగా సాగే ఎన్నికల్లో అధికారపక్షానికి ధీటుగా ఎదుర్కొనేలా గెలుపు గుర్రాల్ని సిద్ధం చేయటం కష్టసాధ్యంగా మారిందంటున్నారు. దీంతో.. విపక్షాలు ఒత్తిడితో ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్లు చెబుతున్నారు.