• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఎట్టకేలకు రెడ్ శాండిల్...

ఎట్టకేలకు రెడ్ శాండిల్ క్వీన్ అరెస్ట్

By - Tupaki Desk
Update: 2017-03-29 04:54 GMT
నెలల తరబడి చేసిన ప్రయత్నాలు ఎట్టకేలకు సక్సెస్ అయ్యాయి. ఎర్రచందనం అక్రమ రవాణాలో మొనగత్తె లాంటి రెడ్ శాండిల్ క్వీన్ కమ్ సినీనటి.. ఎయిర్ హోస్టెస్ సంగీత చటర్జీని ఎట్టకేలకు చిత్తూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఎర్రచందనాన్నిస్మగ్లింగ్ చేయటం ద్వారా కోట్లాది రూపాయిల్ని కూడబెట్టటమే కాదు.. బెంగాల్ లో తిరుగులేని రీతిలో చక్రం తిప్పే అమ్మడికి అరదండాలు వేయటంలో చిత్తూరు పోలీసులు విజయం సాధించారు.

గతంలో చిత్తూరు పోలీసులు బెంగాల్ కు వెళ్లి మరీ అదుపులోకి తీసుకోగా.. గంటల వ్యవధిలో బెయిల్ మీద బయటకు వచ్చిన ఆమె రేంజ్ అప్పట్లో సంచలనం సృష్టింటచటమే కాదు.. ఆమెను అరెస్ట్ చేయటం ఎంత కష్టమన్న విషయం అర్థమైంది.అప్పటి నుంచి ఎన్ని ప్రయత్నాలు చేసినా..ఆమెను అరెస్ట్ చేయటం సాధ్యం కాని పనిగా మారింది.పట్టువదలని విక్రమార్కుల మాదిరి వ్యవహరించిన చిత్తూరు పోలీసులు.. పశ్చిమబెంగాల్ రాజధాని కోల్ కతాకు చెందిన సంగీత చటర్జీని అదుపులోకి తీసుకోగలిగారు.

విమానసంస్థలో ఎయిర్ హోస్టెస్ గా పని చేస్తూ.. తర్వాతి కాలంలో సినీ నటిగా పరిచయమైన ఆమె..తర్వాతి కాలంలో ఎర్రచందనం స్మగ్లర్ లక్ష్మణ్ కు దగ్గరైంది. అతని అరెస్ట్ నేపథ్యంలో రెడ్ శాండిల్ ను స్మగ్లింగ్ చేయటంతో పాటు.. హవాలా పద్ధతిలో భారీగా నగదును మార్చినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కోర్టు ఆదేశాల మేరకు ఆమెను అరెస్ట్ చేసేందుకు చిత్తూరు పోలీసులు కోల్ కతాకు వెళ్లారు.

అయితే.. ఆమెను అరెస్ట్ చేయటం అంత తేలిక కాదన్న విషయం చిత్తూరు పోలీసులకు అర్థమైంది. నాటి నుంచి అదే పనిగా ప్రయత్నాలు చేస్తూ.. కోల్ కతా స్థానిక కోర్టుల అడ్డుంకుల్నిఅధిగమించి ఎట్టకేలకు ఆమెను అరెస్ట్ చేశారు. మంగళవారం అర్థరాత్రి ఆమెను చిత్తూరు తీసుకొచ్చారు. ఆమెను విచారిస్తే.. ఎర్రచందనం స్మగ్లింగ్ కు సంబంధించిన కీలక ఆధారాలు బయటకు వచ్చే అవకాశం ఉందన్న మాట వినిపిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Sangeeta Chatterjee 
  • Sandalwood Smuggling 
  • Telugu NEws 

Similar News

ఇతరుల ఆనందమే కొలమానమా? జెన్ జెడ్ ను ఒత్తిడికి గురిచేస్తున్న సోషల్ మీడియా

2026-11-02 11:30 GMT

50 టీఎంసీల వరద..?! ‘మురసు’తో నిండనున్న పులిచింతల, నాగార్జునసాగర్

2026-11-02 11:04 GMT

దక్షిణాదికి బుల్లెట్ ట్రైన్.. బెంగళూరు నుంచి చెన్నైకి కేవలం 73 నిమిషాల్లోనే!

2026-11-02 10:24 GMT

తుఫాన్ల నెల నవంబర్.. అసలు కారణాలు ఏంటి?

2026-11-02 10:00 GMT

అమెరికా ఎన్నికలతో భారత్‌కు కొత్త పరీక్ష.. ట్రంప్ ఓడితే భారత్ కు లాభమా? నష్టమా?

2026-11-02 10:00 GMT

రాప్తాడు ఉన్మాదికి పోలీసు శిక్ష.. కుళ్లిపోయిన కుడికాలు, తొలగించే అవకాశం!

2026-11-02 09:58 GMT

తెలంగాణపై బీజేపీ ఫుల్ ఫోకస్.. అమిత్ షా ‘హైదరాబాద్ వ్యూహం’ గేమ్ ఛేంజర్ అవుతుందా?

2026-11-02 09:50 GMT

నెల్లూరుకు సమీపంలో ‘మురసు’.. ఐదు జిల్లాలలో భారీ వర్షాలు

2026-11-02 08:24 GMT

రాప్తాడు బాలిక హెల్త్ బులిటెన్.. కీలక సమాచారం వెల్లడించిన మంత్రి లోకేశ్

2026-11-02 07:56 GMT

ఓడిపోతానని ట్రంప్ కు జ్ఞానోదయం.. ఇన్నాళ్లకు తెలిసి (తెలివి) వచ్చింది..

2026-11-02 07:05 GMT

మారథాన్‌లో విజయం.. జీవితంలో విషాదం.. పరుగుపందెం పూర్తి చేసి ప్రాణాలు విడిచిన టెక్కీ

2026-11-02 06:43 GMT

తొలిరోజే రూ.68 లక్షల జరిమానాలు.. ఢిల్లీలో కాలుష్యంపై యుద్ధం..

2026-11-02 05:28 GMT

Copyright @2026

Powered by Blink CMS