పంచాయితీల్లో గెలుపు లెక్కను పక్కాగా ప్రకటించిన సజ్జల
ఏపీలో జరుగుతున్న పంచాయితీ ఎన్నికల్లో ఫలితాల మీద గందరగోళం వ్యక్తమవుతోంది. అధికార.. ప్రతిపక్ష పార్టీలు రెండూ.. తమ మద్దతుదారుల గెలుపును కండబలంగా ప్రత్యర్థి పార్టీలు అడ్డుకుంటున్నట్లుగా ఆరోపిస్తున్నాయి. ఈ విషయంలో అధికార పార్టీతో పోలిస్తే.. విపక్ష పార్టీనే ఎక్కువగా ఆరోపిస్తున్నాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే.. పంచాయితీ ఎన్నికల ఫలితాల్లో ఏ పార్టీ మద్దతుదారులు ఎన్ని స్థానాల్ని సొంతం చేసుకున్నారన్న విషయంపై అస్పష్టత నెలకొంది. ఈ నేపథ్యంలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక్రిష్ణారెడ్డి తెర మీదకు వచ్చారు.
రెండో విడతలో వైసీపీ మద్దతుదారులు 2613 మంది.. రెబల్ అభ్యర్థులు 36 మందితో కలుపుకొని మొత్తంగా 2649 స్థానాల్లో తాము గెలిచినట్లుగా ప్రకటించారు. టీడీపీ 538 స్థానాల్లో.. బీజేపీ ఐదు స్థానాల్లో.. జనసేన 35 చోట్ల.. ఇతరులు 98చోట్ల గెలిచినట్లుగా ఆయన పేర్కొన్నారు. వాస్తవం ఇలా ఉంటే.. విపక్ష నేత చంద్రబాబు మాత్రం తాము 40 శాతం స్థానాల్ని సొంతం చేసుకున్నట్లుగా చెబుతున్నారన్నారు.
తాము గెలుపొందిన స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల ఫోటోలతో సహా వివరాల్ని వెల్లడించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ఫోటోలతో ప్రకటించిన వారిలో తప్పుగా చూపిస్తే.. తాము ఆ తప్పును అంగీకరిస్తామన్నారు. విలేకరుల సమావేశాన్ని నిర్వహించిన సజ్జల.. రాష్ట్రంలో రెండో విడత పంచాయితీలో జిల్లాల వారీగా తమ పార్టీ.. తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు గెలిచిన పంచాయితీ డేటాను విడుదల చేశారు. అందులో పేర్కొన్న దాని ప్రకారం చూస్తే..
జిల్లా వైసీపీ టీడీపీ
శ్రీకాకుళం 242 29
విజయనగరం 300 74
విశాఖపట్నం 194 59
తూర్పుగోదావరి 186 36
పశ్చిమగోదావరి 161 39
క్రిష్ణా 148 36
గుంటూరు 188 44
ప్రకాశం 219 37
నెల్లూరు 162 27
కర్నూలు 184 41
అనంతపురం 247 54
కడప 150 23
చిత్తూరు 232 39
నోట్.. రెబల్ అభ్యర్థులు గెలిచిన 36 పంచాయితీల వివరాల్నిఇందులో పేర్కొనలేదు.