• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  వెంక‌య్య చెప్పిన పురిటి...

వెంక‌య్య చెప్పిన పురిటి నొప్పుల సామెత‌

By - Tupaki Desk
Update: 2016-12-25 06:41 GMT
మాటల మాంత్రికుడిగా పేరొందిన కేంద్ర మంత్రి వెంక‌య్య‌నాయుడు సంద‌ర్భోచితంగా విసిరే చెణుకుల‌పై ఏపీ మాజీ మంత్రి సాకె శైలజానాథ్ ఘాటు సెటైర్ వేశారు. పెద్దనోట్ల రద్దు నిర్ణయం ప్రజా వ్య‌తిరేక‌మ‌ని శైల‌జ‌నాథ్ మండిప‌డ్డారు. దేశం కోసం అని ఈ నిర్ణ‌యం తీసుకుని 46 రోజులు గడిచిపోయినా రాష్ట్రం లో కష్టాలు తీరక‌పోవ‌డ‌మే ఇందుకు నిద‌ర్శ‌న‌మ‌ని మండిప‌డ్డారు. ఒకవైపు ఆర్థిక సంక్షోభంతో ప్రజలంతా ఇబ్బందులు పడుతుంటే, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు మాత్రం ప్రసవ సమయంలో పురిటి నొప్పులంటూ ఛలోక్తులు విసరడం విడ్డూరంగా ఉందన్నారు.  వాస్త‌వ ప‌రిస్థితుల భ‌యంక‌రంగా ఉంటే కేంద్ర మంత్రిగా ఉన్న వెంక‌య్య‌కు సెటైర్లు వేయ‌డానికి ఎలా మ‌న‌సు వ‌చ్చింద‌ని శైల‌జానాథ్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

ప్రధాని మోడీ నిర్ణయం దేశంలోని 99 శాతం మంది ప్రజలను కష్టాల పాలు చేసిందని శైల‌జానాథ్ మండిప‌డ్డారు.  తాజాగా కేంద్రం జ‌పిస్తున్న డిజిట‌ల్ లావాదేవీల వెనుక మ‌ర్మం వేరే ఉంద‌ని ఆయ‌న పేర్కొన్నారు. కార్పొరేట్‌ సంస్థలకు దోచి పెట్టడం కోసమే క్యాష్‌ లెస్‌ అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చారని విమర్శించారు. త‌మ నాయ‌కుడు రాహుల్‌ గాంధీ వాస్తవాలతో సహా ముడుపుల వ్యవహారాన్ని బయటపెడితే - ప్ర‌ధాన‌మంత్రి దానికి సమాధానం చెప్పలేకపోతున్నారని విమర్శించారు. పైగా త‌మ‌పై ఆరోప‌ణ‌లు చేసే ప్ర‌య‌త్నం సాగిస్తున్నార‌ని శైల‌జానాథ్ అస‌హనం వ్య‌క్తం చేశారు.

ఇదిలాఉండ‌గా కాంగ్రెస్ మాజీ ఎంపీ వీ హనుమంతరావు సైతం ప్ర‌ధానిపై మండిప‌డ్డారు. పేదల డబ్బులపైన ప్రధాన మంత్రి నరేంద్రమోడీ పెత్తనం ఏమిటని ప్రశ్నించారు. ప్ర‌జ‌ల వద్ద వంద రూపాయ‌ల‌కే ఇబ్బందులు ఎదుర‌వుతుంటే... బీజేపీ నేతలు వందల కోట్లు పెట్టి పెళ్లిల్లు ఎలా చేస్తున్నారని వీహెచ్ ప్ర‌శ్నించారు. కొత్త నోట్లు బడాబాబుల వద్దకు ఎలా చేరుతున్నాయని ప్రశ్నించారు. దీనికి మోడీ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.  నోట్ల రద్దుపై చంద్రబాబు తీసుకున్న యూ టర్న్‌ వాయిస్‌ ను మోడీ దగ్గర వినిపించాలని ఎద్దేవా చేశారు. నరేంద్రమోదీ హఠావో .. దేశ్‌ కో బచావో అన్న మమతా బెనర్జీ నినాదాన్ని కాంగ్రెస్‌ సంపూర్ణ మద్దతు తెలుపుతుందన్నారు పెట్రోల్‌ బంకుల్లో పెట్రోల్‌ పోసుకునే సమయంలో కార్డు స్వైపు చేయడం నిషేదామని పెట్రోలియం శాఖ సూచించడం దుర్మార్గమని మండిప‌డ్డారు. పెట్రోల్‌ పొసే సమయంలో ఫోన్‌ వాడకం... కార్డు స్వైపు అత్యంత ప్రమాదమని చెప్పడం సరైందికాదన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Sailajanath 
  • Venkaiah Naidu 

Similar News

వీఐపీలు వస్తేనే ముంబైకి అందం.. సామాన్యులు ఉంటే ఎందుకీ దుర్గంధం?

2026-11-19 18:30 GMT

సహచరుల వద్ద తలెత్తుకోలేకపోతున్నా.. ఇప్పుడే వైసీపీలోకి వెళ్లిపోండి! – టీడీపీ ఎమ్మెల్యే థామస్ సంచలన వ్యాఖ్యలు

2026-11-19 17:30 GMT

AI హడావుడి.. సినిమాకు ఒరిగిందేంటి!

2026-11-19 17:30 GMT

పార్టీలు, ఫంక్షన్లు జరగాలంటే ఆ రూల్స్ పాటించాలా?

2026-11-19 16:30 GMT

చంద్రబాబు దెబ్బకు తమిళనాడులో అలజడి!? ఏపీకి డేటా లీక్, 15 మందిపై వేటు! నిజమేనా?

2026-11-19 15:30 GMT

ఆ ఒక్క తప్పు చేస్తే మళ్లీ కష్టాలే : ప్రధాని మోదీ హెచ్చరిక.. తినడం, తిరగడం, తాగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-19 14:30 GMT

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

Copyright @2026

Powered by Blink CMS