• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  స్విట్జర్లాండ్ ఆంక్షలకు...

స్విట్జర్లాండ్ ఆంక్షలకు షాకిచ్చిన రష్యా

By - Tupaki Desk
Update: 2022-03-30 03:30 GMT
ఉక్రెయిన్ పై యుద్ధానికి దిగిన రష్యాపై యూరప్ దేశమైన స్విట్జర్లాండ్ తాజాగా ఆంక్షలు విధించింది. ఈ క్రమంలోనే రష్యా సైతం స్విట్జర్లాండ్ దేశానికి గట్టి షాక్ ఇచ్చింది. రష్యాలో తమ కార్యకలాపాలను తగ్గించుకుంటున్న విదేశీ సంస్థల ఆస్తులను సీజ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు రష్యన్ అధికారులు. గత కొన్ని వారాల్లో ఈ చర్యలు మరింతగా పెరగనున్నాయి. ఈ క్రమంలోనే స్విట్జర్లాండ్ కు చెందిన ప్రఖ్యాత స్విస్ గడియారాలను మాస్కో బ్రాంచీ నుంచి రష్యా స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది.

ఉక్రెయిన్ పై రష్యా దాడి ప్రారంభమైన తరువాత, ఈ సంస్థ రష్యాలో తమ కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. స్విట్జర్లాండ్ గత ఏడాది రూ.2126 కోట్ల విలువైన గడియారాలను ఎగుమతి చేసిందని పరిశ్రమ అధికారులు చెబుతున్నారు. కానీ రష్యాలో లగ్జరీ వస్తువులకు ఉన్న డిమాండ్ బట్టి చూస్తే వీటి మార్కెట్ విలువ అంతకన్నా చాలా ఎక్కువ. ఈ క్రమంలోనే రష్యాసర్కార్ సుమారు రూ.75949 కోట్ల విలువ చేసే లీజుకు తీసుకున్న విదేశీ జెట్లను రష్యా నిలిపివేసింది. ఈ విమానాలను వెనక్కి తిరిగి ఇవ్వమని యజమానులు చేసిన అభ్యర్థనలను తోసిపుచ్చింది.

రష్యా నుంచి వైదొలుగుతున్న పాశ్చాత్య కంపెనీల ఆస్తులను జాతీయం చేయడానికి రష్యా కొత్త చట్టాన్ని తీసుకువచ్చే  అవకాశం ఉందని రష్యా మాజీ అధ్యక్షుడు తెలిపారు.  ఈ క్రమంలోనే స్విస్ దేశానికి చెందిన కోట్లు విలువ చేసే ‘ఆడెమర్స్ పిగెట్’ వాచీలను రష్యా అధికారులు జప్తు చేసినట్లు తెలిసింది. మంగళవారం రష్యా సెక్యూరిటీ సర్వీస్ ఏజెంట్లు ఈ వాచీలను మాస్కోలోని ఒక దుకాణం  నుంచి స్వాధీనం చేసుకున్నారని స్విస్ మీడియా తెలిపింది. కస్టమ్స్ నిబంధనలను ఉల్లంఘించినందుకే వీటిని సీజ్ చేసినట్లు స్థానిక మీడియా పేర్కొంది.

స్విట్జర్లాండ్ తన తటస్థ వైఖరిని విడిచిపెట్టి రష్యాపై ఆంక్షలు విధించిన కొద్దిరోజులకే రష్యా ఇలా ఆ దేశపు ఖరీదైన కోట్ల విలువ చేసే వాచీలను స్వాధీనం చేసుకొని షాక్ ఇచ్చింది. దీనిపై స్విస్ నుంచి ఎలాంటి నిర్ధారణ రాలేదు. ఒక్కో ఆడెమర్స్ పిగెట్ వాచ్ ధర ఏకంగా సుమారు రూ.7 కోట్లు ఉంటుంది.
Tags:    
  • Switzerland 
  • Switzerland Decision 
  • RussiaUkraineWar 
  • UkraineUnderAttack 
  • UkraineRussia 
  • Ukraine 
  • russianinvasion 
  • StopWar 

Similar News

పార్టీలు, ఫంక్షన్లు జరగాలంటే ఆ రూల్స్ పాటించాలా?

2026-11-19 16:30 GMT

చంద్రబాబు దెబ్బకు తమిళనాడులో అలజడి!? ఏపీకి డేటా లీక్, 15 మందిపై వేటు! నిజమేనా?

2026-11-19 15:30 GMT

ఆ ఒక్క తప్పు చేస్తే మళ్లీ కష్టాలే : ప్రధాని మోదీ హెచ్చరిక.. తినడం, తిరగడం, తాగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-19 14:30 GMT

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

Copyright @2026

Powered by Blink CMS