ఇళ్ల పేరుతో రూ.70 లక్షలు టోకరా ..నిందితుడి అరెస్ట్ !
ప్రజల అమాయకత్వాన్ని కొంతమంది క్యాష్ చేసుకుంటున్నారు. ప్రభుత్వ పథకాలలో మధ్యవర్తుల ప్రవేశం ఉండదు , డబ్బులు కట్టి మోసపోకండి అని ఎంతగా ప్రచారం చేస్తున్నా కూడా ఇంకా కొంతమంది తమ అమాయకత్వంతో అలాంటి వారి బుట్టలో పడి , డబ్బులు కట్టి , ఆ తరువాత లబోదిబోమంటున్నారు. తాజాగా తెలంగాణ ప్రభుత్వం నుంచి డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇప్పిస్తానంటూ దాదాపు 40 మందిని మోసగించిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోని చేపడుతున్న పథకం డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పథకం. పేదల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని, ప్రభుత్వం నుంచి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇప్పిస్తామంటూ కొందరు కేటుగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. గతంలోనే ఇలాంటి కేసులు కొన్ని నమోదుకాగా...తాజాగా మరొకరిని సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. అలాగే , నిందితుని నుంచి 8 లక్షల క్యాష్ ఫేక్ అలాట్మెంట్ లెటర్స్, స్టాం ప్స్ స్వాధీనం చేసుకున్నారు.
దీనిపై సీపీ సజ్జనార్ మాట్లాడుతూ .. ఈస్ట్ గోదావరి జిల్లా నడిమిలంకకు చెందిన గుతుల ప్రశాంత్ కెపీహెచ్ బీ లో నివాసం ఉంటున్నాడు. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే డబుల్ బెడ్రూమ్ ఇండ్లపేరుతో ఈజీగా డబ్బు సంపాదించాలని భావించి, విజన్ 1 టీవీ ఏర్పాటు చేశాడు. ప్రెస్ ఐడీ కార్డ్ చూపించి, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇప్పిస్తానని జనాలని నమ్మిస్తున్నాడు. నిజాంపేట్, ఖైత్లాపుర్ ఏరియాల్లో వివిధ మీడియాసంస్థల్లో పని చేస్తున్న వారిని ట్రాప్ చేశాడు. ఒక్కొక్కరి నుంచి రూ.1.55 లక్షల నుంచి రూ.1.70లక్షల వరకు వసూలుచేశాడు.
కొన్ని రోజుల తరువాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినట్టుగానే ఆర్డర్ కాపీ తన ల్యాప్‌టాప్‌లో రెడీ చేసి ఆ తర్వాత బాండ్ పేపర్‌పై కలర్ జిరాక్స్ తీశాడు. దానిపై మేడ్చల్ జిల్లాలోని ఓ సెక్షన్ ఆఫీసర్ సంతకాన్ని ఫోర్జరీ చేసి ఆర్డర్ కాపీ అందరికీ ఇచ్చాడు. ఇలా కేపీహెచ్ బీ, కూకట్ పల్లి,బాచుపల్లి,మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దాదాపు 40 మంది నుంచి రూ.70 లక్షలకు పైగా వసూలు చేశాడని పోలీసులు తెలిపారు.
గతంలోనూ సైబరాబాద్ పోలీసు కమినరేట్ లో సబ్ ఇన్‌స్పెక్టర్ గా నకిలీ పోలీసు ఐడీని క్రియేట్ చేసి హైవే టోల్ గేట్ ల వద్ద డబ్బులు చెల్లించకుండానే తిరుగుతుండటంతో విజయవాడలోని భవానీపురం పోలీసులు ప్రశాంత్ ను జూన్ 24న అరెస్టు చేశారు. ఆ తర్వాత జైలు నుంచి బయటకు వచ్చిన ఇతగాడు డబుల్‌బెడ్రూం ఇళ్ల పేరుతో డబ్బులు వసూలు చేసినట్లు పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చింది.