పొరుగు దేశం భారీ యుద్ధ విన్యాశాలు.. భీకర యుద్ధం జరగబోతుందా..!

మరో వైపు 2026లో మూడు ప్రపంచ యుద్ధానికి అవకాశాలున్నాయని బాబా వంగ, నోస్ట్రడమస్ లాంటి వారి అంచనాలు హల్ చల్ చేస్తోన్న వేళ.. తాజాగా ఓ సంచలన విషయం తెరపైకి వచ్చింది.;

Update: 2025-12-29 05:44 GMT

ఇప్పటికే ఈ ప్రపంచంలో మూడు ఘర్షణలు, ఆరు యుద్ధాలు, కాల్పుల మోతలు, అణ్వాయుధ పరీక్షల ఆందోళనలు నెలకొన్న వేళ.. మరో వైపు 2026లో మూడు ప్రపంచ యుద్ధానికి అవకాశాలున్నాయని బాబా వంగ, నోస్ట్రడమస్ లాంటి వారి అంచనాలు హల్ చల్ చేస్తోన్న వేళ.. తాజాగా ఓ సంచలన విషయం తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా.. తైవాన్ ను చుట్టుముట్టి భారీ ఎత్తున యుద్ధ విన్యాసాలు చేయనున్నట్లు చైనా ప్రకటించింది. జపాన్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

అవును... తైవాన్ చుట్టూ ఉమ్మడి సైనిక విన్యాసాలు నిర్వహించడానికి వైమానిక, నౌకాదళ, రాకెట్ దళాలను పంపుతున్నట్లు చైనా సైన్యం సోమవారం తెలిపింది. ఈ చర్యను వేర్పాటువాద, బాహ్య జోక్యం శక్తులకు వ్యైరేకంగా కఠినమైన హెచ్చరిక అని అభివర్ణించింది. ఈ సందర్భంగా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఈస్టర్న్ థియేటర్ కమాండ్ ప్రతినిధి సీనియర్ కల్నల్ షి యీ స్పందిస్తూ.. ఈ విన్యాసాలు "జస్టిస్ మిషన్ - 2025" పేరిట చేయనున్నట్లు ప్రకటించారు.

ఇందులో భాగంగా... ఈ మిషన్ పేరిట తైవాన్ జలసంధిలో యుద్ధ విన్యాసాలు చేయనున్నట్లు ప్రకటించారు. సముగ్ర, గగనతల యుద్ధ సన్నద్ధతను పరీక్షించుకోవడం, ద్వీప సమూహాల బయట బ్లాకేడ్స్ నిర్వహించడం వంటివి చేయనున్నట్లు తెలిపారు. ప్రధానంగా... తైవాన్ లోని వేర్పాటువాద శక్తులకు ఇది బలమైన హెచ్చరిక అని.. జాతీయ సమైక్యత, సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి చైనా తగిన చర్యలు తీసుకొంటుందని అన్నారు.

మరోవైపు ఈ విషయంపై స్పందించిన జపాన్ ప్రధాన మంత్రి సనే తకైచి... తైవాన్ ను రక్షించేందుకు అవసరమైతే తాము రంగంలోకి దిగుతామని ప్రకటించారు. తైవాన్ తన పాలనలోకి రావాలని ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కోరుకుంటుందని.. ఈ క్రమంలో స్వయం పాలన ద్వీపమైన తైవాన్ పై చైనా చర్య తీసుకుంటే తమ సైన్యం జోక్యం చేసుకోవచ్చని అన్నారు. ఈ ప్రకటన నేపథ్యంలోనే చైనా అలర్ట్ అయ్యి, సైనిక విన్యాసాలు షురూ చేసిందని చెబుతున్నారు.

పైగా... తైవాన్ కు సుమారు 10 బిలియన్ డాలర్లకు పైగా విలువైన పెద్ద ఎత్తున ఆయుధ అమ్మకాలను వాషింగ్టన్ ప్రకటించింది. ఆ ప్రకటన వచ్చిన వారం రోజుల తర్వాత బీజింగ్ గత వారం 20 అమెరికా రక్షణ సంబంధిత కంపెనీలు, 10 కార్యనిర్వాహకులపై ఆంక్షలు విధించింది.

ఈ పరిణామాల నేపథ్యంలో తైవాన్ అధ్యక్షుడి కార్యాలయ ప్రతినిధి కురెన్ కువో స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... తైవాన్ జలసంధి, ఇండో-పసిఫిక్ ప్రాంత స్థిరత్వం, భద్రతను ఈ ఆపరేషన్ దెబ్బతీస్తోందని.. అంతర్జాతీయ శాంతిభద్రతలను బహిరంగంగా సవాలు చేస్తోందని అన్నారు. ఈ సందర్భంగా... చైనా తాజా చర్యను తమ దేశం తీవ్రంగా ఖండిస్తోందని తెలిపారు.

కాగా... 1949లో జరిగిన అంతర్యుద్ధం కారణంగా బీజింగ్ లో కమ్యునిస్టు పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చైనా, తైవాన్ లు విడివిడిగా పరిపాలించబడుతున్నాయి. ఈ సమయంలో ఓడిపోయిన నేషనలిస్ట్ పార్టీ దళాలు తైవాన్ కు పారిపోయాయి. అప్పటి నుంచి ఈ ద్వీపం దాని స్వంత ప్రభుత్వ పాలనలోనే ఉంది!

Tags:    

Similar News