లైంగిక వేధింపుల కేసులో రూ.10 కోట్ల డిమాండ్.. ఇద్దరు మహిళలు అరెస్ట్!
అవును... ముంబైలో ఓ ఆసక్తికర విషయం తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా.. లైంగిక వేధింపుల కేసులో రూ.10 కోట్ల విమోచన క్రయధనం డిమాండ్ చేయగా.. విషయం తెలుసుకున్న అనంతరం ఇద్దరు మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు.;
సాధారణంగా ఈ సమాజం స్త్రీ పక్షపాతి అని అంటారు! ఓ మహిళ ఫిర్యాదు చేసిందంటే.. ప్రధానంగా మరో పురుషుడిపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిందంటే.. అది నిజమా అబద్ధమా అని ఆలోచించకుండా చాలా మంది ఒక కన్ క్లూజన్ కు వచ్చేస్తుంటారని.. విషయం తెలియకుండా సరదు పురుషులపై పోస్టులు మొదలుపెడతారని అంటారు! ఈ క్రమంలో.. సున్నితమైన కేసుల్లో తీర్మానాలు చేసే ముందు సరైన దర్యాప్తు ప్రాముఖ్యతను నొక్కి చెప్పే వ్యవహారం ఒకటి తాజాగా ముంబైలో వెలుగు చూసింది.
అవును... ముంబైలో ఓ ఆసక్తికర విషయం తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా.. లైంగిక వేధింపుల కేసులో రూ.10 కోట్ల విమోచన క్రయధనం డిమాండ్ చేయగా.. విషయం తెలుసుకున్న అనంతరం ఇద్దరు మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందులో భాగంగా.. హేమలత ఆదిత్య పాట్కర్ (39), అమ్రినా ఇక్బాల్ జవేరి (33) అనే మహిళలను ముంబై యాంటీ ఎక్స్టోర్షన్ సెల్ పోలీసులు అరెస్టు చేశారు. ఒక వ్యాపారవేత్త ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ అరెస్టులు జరిగాయి.
వివరాళ్లోకి వెళ్తే... గోరేగావ్ వెస్ట్ లో నివసిస్తున్న వ్యాపారవేత్త, గోయల్ & సన్స్ ఇన్ ఫ్రా ఎల్.ఎల్.పీ సంస్థను నిర్వహిస్తున్న అరవింద్ గోయల్ కుమారుడు రీతం.. నవంబర్ 5న యశ్వీ షా తో నిశ్చితర్థం చేసుకున్నాడు. దీనికి సంబంధించిన పార్టీ నవంబర్ 14న రాత్రి అంబోలి ప్రాంతంలోని ఓ హోటల్ లో జరిగింది. పార్టీ తర్వాత నవంబర్ 15 తెల్లవారుజామున 2:40 గంటల ప్రాంతంలో.. రీతం, అతనికి కాబోయే భార్య యశ్వీ షా, ఆమె సోదరుడు, ఒక స్నేహితుడు కలిసి లిఫ్ట్ లో దిగుతున్నారు.
ఆ సమయంలో ఓ గుర్తు తెలియని మహిళ లోపలికి ప్రవేశించింది. ఆ సమయంలో.. రీతం తనపై లేజర్ లైట్ ప్రసరింపజేశాడని ఆ మహిళ ఆరోపించింది. ఈ ఆరోపణ వాగ్వాదానికి దారితీసింది. ఈ క్రమంలో లిఫ్ట్ గ్రౌండ్ ఫ్లోర్ కి చేరుకోగానే.. అలారం మోగించిన ఆ మహిళ, గట్టిగా అరవడం ప్రారంభించింది. ఈ సంఘటన వల్ల తాను గర్భం కోల్పోయినట్లు చెబుతూ.. పెద్ద సీనే క్రియేట్ చేసింది! కట్ చేస్తే... అంబోలా పోలీస్ స్టేషన్ లో లైంగిక వేధింపుల కేసు నమోదైంది.
ఈ నేపథ్యంలో.. కోర్టు బయటే కేసును పరిష్కరించుకునేందుకు ఆమెతో పాటు మరో మహిళ అంగీకరించారు. ఈ సమయంలో ఇద్దరు మహిళలు రూ.10 కోట్లు అడిగారని అంటున్నారు. ఈ క్రమంలో.. డిసెంబర్ 20న హేమలత ఆదిత్య పాట్కర్.. రీతం తండ్రి అరవింద్ గోయల్ కు ఫోన్ చేసి, అంధేరి వెస్ట్ లోని ఒక కేఫ్ లో కలవమని చెప్పింది. అక్కడ తనకు డబ్బు చెల్లించాలని లేకపోతే.. అతని కోడుకు జీవితాంతం జైల్లో మగ్గిపోవాల్సి వస్తుందని బెదిరించింది.
ఈ క్రమంలో అనేక చర్చలు, బేరసారాల అనంతరం వ్యవహారం రూ.5.5 కోట్ల వద్ద సెటిల్ అయ్యింది. అంత మొత్తం తీసుకోవడానికి మహిళలు అంగీకరించారు. ఈ సమయంలో ముంబై పోలీసులు, అరవింద్ గోయల్ తో కలిసి ఆ ఇద్దరు మహిళలకు ఉచ్చు బిగించారు. ఇందులో భాగంగా.. నకిలీ కరెన్సీ నోట్ల సహా రూ.1.5 కోట్లు లంచం ఇవ్వడానికి ఆ మహిళలను లోయర్ పరెల్ ప్రాంతానికి పిలిచారు. ఈ సమయంలో ఇద్దరు మహిళలను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న పోలీసులు ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేశారు.