జిల్లా స్టేట‌స్‌: అనంత‌లో ఎవ‌రికి వారే.. !

ఇక‌, రాయ‌దుర్గం నియోజ‌క‌వ‌ర్గంలో సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు మ‌రోఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.;

Update: 2026-03-07 02:30 GMT

ఉమ్మ‌డి అనంతపురం జిల్లా రాజ‌కీయాలు క‌లివిడి త‌క్కువ‌-విడివిడికి ఎక్కువ అనే టాక్‌ను వినిపిస్తున్నా యి. వాస్త‌వానికి ఇక్క‌డి అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ.. టీడీపీకి స‌త్తా ఉంది. బ‌ల‌మైన కేడ‌ర్ కూడా ఉంది. 2019 ఎన్నిక‌ల‌తో పోల్చుకుంటే.. 2024లో బ‌ల‌మైన టీడీపీవ‌ర్గంగా ఇక్క‌డ నాయ‌కులుఎదిగారు. అనేక మంది సీనియ‌ర్లు పోటీ చేసి విజ‌యం ద‌క్కించుకున్నారు. ఇక‌, తాడిప‌త్రి, అర్బ‌న్, శింగ‌న‌మ‌ల‌ నియోజ‌క వ‌ర్గాల్లో కొత్త నాయ‌కులు విజ‌యం సాధించారు.

అయితే.. నాయ‌కులు క‌లివిడిగా ఉన్నారా? అంటే.. చెప్ప‌డం క‌ష్ట‌మే. త‌మ త‌మ నియోజ‌క‌వ‌ర్గాల్లోనే కాదు..త‌మ‌కు అవ‌కాశం ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ నాయ‌కులు వేలు పెడుతున్నార‌న్న చ‌ర్చ జోరుగా సాగుతోంది. తాడిప‌త్రి ఎమ్మెల్యేగా ఉన్న అస్మిత్ రెడ్డి అర్బ‌న్ రాజ‌కీయాల్లో జోక్యం చేసుకుంటున్నార‌ని.. అర్బ‌న్ ఎమ్మెల్యే ద‌గ్గుపాటి వెంక‌టేశ్వ‌ర ప్ర‌సాద్ వాదిస్తున్నారు. ఇక‌, ఇక్క‌డ నుంచే క‌డ‌ప‌లో కూడా రాజ‌కీయాలు చేస్తున్నార‌ని అక్క‌డి నాయ‌కులు చెబుతున్నారు.

ఇక‌, రాయ‌దుర్గం నియోజ‌క‌వ‌ర్గంలో సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు మ‌రో ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఎక్క‌డ నుంచో వ‌చ్చి.. త‌న నియోజ‌క‌వ‌ర్గంలో మ‌ట్టిని, ఇసుక‌ను త‌వ్వే స్తున్నార‌ని.. ఆయ‌న చెబుతున్నారు. దీనివ‌ల్ల‌త‌న‌పై బ్యాడ్ నేమ్ వ‌స్తోంద‌ని ఆయ‌న అంటున్నారు. రాప్తాడులో అంత‌ర్గ త పోరు సాగుతోంది. ప‌రిటాల‌ను విభేదించే నాయ‌కులు రెండు వ‌ర్గాలుగా చీలిపోయాయి. వీరి మ‌ధ్య క‌లివిడి కోసం.. పార్టీ ఇద్ద‌రు స‌భ్యుల‌తో క‌మిటీ ఏర్పాటు చేసినా.. ప‌రిస్థితి స‌ర్దుమ‌ణ‌గ‌లేద‌ని అంటున్నారు.

ఇక‌, పుట్ట‌ప‌ర్తి నియోజ‌క‌వ‌ర్గంలో ఎమ్మెల్యే కంటే ఆమె మామ‌, మాజీ మంత్రి తీరుతో నాయ‌కులు, కార్య‌క‌ర్త లు హ‌ర్ట‌వుతున్నార‌న్న వాద‌న జోరుగా వినిపిస్తోంది. ఎమ్మెల్యేకు బ‌దులుగా అధికారిక కార్య‌క్ర‌మాలకు ప‌ల్లె ర‌ఘునాథ‌రెడ్డే హాజ‌రువుతున్నారు. దీనిలో త‌ప్పు సంగ‌తి ప‌క్క‌న పెడితే.. త‌మ‌ను క‌లుపుకోవాల‌ని కోరుతున్నారు నాయ‌కులు. కానీ, వీరిలో కొంద‌రు వైసీపీకి కోవ‌ర్టులు ఉన్నార‌ని.. అందుకే వారిని దూరం పెడుతున్నాన‌ని ప‌ల్లె చెబుతున్నారు. మొత్తంగా ఇది అంత‌ర్గ‌త కుమ్ములాట‌ల‌కు దారి తీస్తోంది. ఇలా.. అనంత‌లో ఎవ‌రికి వారే అన్న‌ట్టుగా నాయ‌కులు వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని చెబుతున్నారు.

Tags:    

Similar News