గుంటూరు.. ఇక 'గొప్ప నగరం'..ప్రత్యేక గుర్తింపు!
ఏపీ రాజధాని అమరావతి ఉన్న గుంటూరు జిల్లాకు మరో అరుదైన గొప్ప గుర్తింపు లభించనుంది.;
ఏపీ రాజధాని అమరావతి ఉన్న గుంటూరు జిల్లాకు మరో అరుదైన గొప్ప గుర్తింపు లభించనుంది. అంతేకాదు.. త ద్వారా నగరం అభివృద్ధిలో మరింత దూసుకుపోనుంది. ఈ మేరకు ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా గ్రేటర్ గుంటూరు ఏర్పాటుకు అధికారులు సమాయత్తమయ్యారు. వాస్తవానికి ఇప్పటికే గుంటూరు నగరంలోని తాడికొండ, మంగళగిరి వంటి నియోజకవర్గాలు అమరావతి నగర విస్తీర్ణంలో ఉన్నాయి. దీంతో గుంటూరు ఇతర గ్రామాలతో కలిసి కొత్తగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. తద్వారా నగరంలోని కొంత భాగం అమరావతిలో పోయినా.. మిగిలిప్రాంతాలను కలిపి.. గుంటూరును గ్రేటర్‌గా మార్చడం ద్వారా అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలని సంకల్పించింది.
ఏం చేస్తున్నారు.
గ్రేటర్ గుంటూరు ఏర్పాటులో భాగంగా విసిరేసినట్టుగా దూరంగా ఉన్న 18 గ్రామాలను గుంటూరునగర పరిధిలోకి తీసుకువస్తా రు. వీటిలో జొన్నలగడ్డ, తోకవారిపాలెం, గొర్లవారిపాలెం, మల్లవరం, చినపలకలూరు, తురకపాలెం, దాసుపాలెం, చల్లావారి పాలెం, వెంగళాయపాలెం, ఓబులనాయుడుపాలెం, లాల్‌పురం, లాం, పుల్లడిగుంట, తక్కెళ్లపాడు, అగతవరప్పాడు వెనిగండ్ల, కొర్నిపాడు గ్రామాలు ఉన్నాయి. ఇప్పటి వరకు పంచాయతీలుగా ఉన్న వీటిని నగరం పరిధిలోకి తీసుకువస్తారు. తద్వారా కార్పొరేషన్‌లో ఇవి భాగం కానున్నాయి. వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికలకు ముందే ఈ ప్రక్రియ పూర్తిచేయడం ద్వారా గుంటూరును విస్తరించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఏం జరుగుతుంది?
ఇలా గుంటూరును ఆనుకుని ఉన్న గ్రామాలను కలుపుకోవడం ద్వారా.. నగరం పరిధి పెరిగి.. జనాభా సంఖ్య కూడా పెరుగుతుం ది. తద్వారా 10 లక్షల మంది నివసించే నగరంగా గుంటూరు గుర్తింపు తెచ్చుకుంటుంది. ఫలితంగా కేంద్రం నుంచి వచ్చే నిధుల తో పాటు పన్నుల రూపంలో కార్పొరేషన్‌కు నిధులు సమకూరుతాయి. మరోవైపు ప్రజలకు మౌలిక సదుపాయాలు.. రహదారు ల కనెక్టివిటీ వంటివి మెరుగవుతాయి. విలీన గ్రామాల మీదుగా అమరావతి రాజధాని రింగ్ రోడ్డు కూడా వెళ్తున్న నేపథ్యంలో ఆయా భూములకు ధరలు పెరగనున్నాయి. అలానే.. జోనళ్లు, కౌన్సిళ్లు ఏర్పడడంతో పనులు సులభం కానున్నాయి. మరోనాలుగు పోలీసు స్టేషన్లను కూడా ఏర్పాటు చేయనున్నారు. ఇలా.. గుంటూరు రూపు రేఖలు త్వరలోనే మారనున్నాయి.