తెల్లారేసరికి రూ.55 కోట్లు బ్యాంకులో వేసేశారు
వరాల దేవుడన్న పదానికి నిలువెత్తు రూపంగా కనిపిస్తారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. ఏదైనా ఇష్యూను టేకప్ చేస్తే.. దాని అంతు చూసే వరకు వదిలిపెట్టని అధినేతగా ఆయనకున్న పేరు ప్రఖ్యాతుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. విషయం ఎంత జఠిలమైనా.. ఇష్యూ లెక్క తేల్చే విషయంలో అస్సలు వెనక్కి తగ్గని వైనం ఆయన సొంతం. పరిహారం ఇచ్చే విషయంలో.. తెలుగు రాష్ట్రాల చరిత్రలో.. ఆ మాటకు వస్తే దేశ చరిత్రలోనే ఇప్పటివరకు ఏ ముఖ్యమంత్రి చేయని పనిని చేస్తున్న కేసీఆర్ తీరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
హైదరాబాద్ మహానగరాన్ని ముంచెత్తిన వరద కారణంగా లక్షల కుటుంబాలు ప్రత్యక్షంగా ఇబ్బందులకు గురయ్యాయి. ఈ నేపథ్యంలో వరద నీరు వచ్చిన ప్రతి ఇంటికి రూ.10వేల చొప్పున పరిహారం ఇవ్వాలని నిర్ణయించారు. అదే సమయంలో.. తీవ్రంగా నష్టపోయిన వారికి రూ.50వేలు.. పూర్తిగా నష్టపోయిన ఇళ్లకు రూ.లక్ష చొప్పున పరిహారాన్ని ఇవ్వాలని డిసైడ్ చేశారు. దీనికి తగ్గట్లే ప్రతి ఇంటికి రూ.10వేల పరిహారాన్ని నగదు రూపంలో ఇవ్వటం షురూ చేయటం పాత ముచ్చట.
పరిహార పంపిణీలో తేడాలు రావటం.. పలువురుబాధితులు రోడ్డు ఎక్కటం లాంటి వరుస ఉదంతాలతో కేసీఆర్ సర్కారును ఇబ్బందికి గురి చేసింది. ఇలాంటి వాటి లెక్క తేల్చేందుకు కేసీఆర్ ఎంతకైనా వెళతారన్న విషయాన్ని తాజాగా చేతల్లో చేసి చూపించారు. మొన్నటివరకు అధికార యంత్రాంగం.. స్థానిక నేతలు.. ఎమ్మెల్యేల పర్యవేక్షణలో సాగిన పరిహారాన్ని పూర్తిగా మార్చేసి.. మీ సేవా కేంద్రానికి వెళ్లి అప్లై చేసుకుంటే.. పరిహారం ఆన్ లైన్ లో చెల్లిస్తామంటూ ప్రభుత్వం ప్రకటన చేసింది.
దీనికి తగ్గట్లే సోమవారం.. హైదరాబాద్ మహానగరంలోని మీ సేవా కేంద్రాల వద్ద భారీ క్యూలు కనిపించాయి. ఇలాంటివి కేసీఆర్ కు చిక్కులే అన్న మాట వినిపించింది. నిజానికి ఇదే పరిస్థితి మరో ముఖ్యమంత్రికి ఎదురైతే ఆయన రియాక్షన్ వేరేగా ఉండేదేమో? కానీ.. ఇక్కడ ఉన్నది కేసీఆర్ అన్న మాటను చేతల్లో చేసి చూపించారాయన. ముందుగా చెప్పిన ప్రకారం పరిహారం కోసం ఆన్ లైన్ లో అప్లై చేసే వారి వివరాల్ని క్రాస్ చెక్ చేసిన తర్వాత రూ10వేల పరిహారం అందిస్తామని చెప్పారు.
కానీ.. అలాంటిదేమీ లేకుండా సోమవారం అప్లికేషన్లు పెట్టుకున్న వారికి ఎలాంటి తనిఖీలు లేకుండానే మంగళవారం ఉదయం బాధితుల ఖాతాలో రూ.10వేలు చొప్పున పడిపోయాయి. ఇలా పడిన మొత్తం ఎంతో తెలుసా? అక్షరాల రూ.55కోట్లుగా చెబుతున్నారు. సోమవారం పెట్టుకున్న అప్లికేషన్లకు మంగళవారం ఉదయం డబ్బులు పడటం షురూ కావటంతో.. మంగళవారం మీ సేవా కేంద్రాల వద్ద భారీ ఎత్తున బాధితుల పేరుతో పలువురు క్యూ కట్టారు. మంగళవారం మాదిరే.. రూ.50 కోట్లు లేదంటే.. రూ.100 కోట్ల వరకు పరిహారం పేరుతో చెల్లించేందుకు ప్రభుత్వం రెఢీగా ఉందన్న మాట వినిపిస్తోంది. ఇందుకు కదా అనేది.. వరాల దేవుడని.