ట్రెండీ టాక్‌: 2021లో RRR రిలీజ్ సాధ్య‌మేనా?

Update: 2020-12-03 02:30 GMT
సమ్మర్ 2021 విడుద‌ల‌కు ఆర్.‌ఆర్.‌ఆర్ రెడీ అవుతుందా? జ‌క్క‌న్న అంత వేగంగా ఈ సినిమాని పూర్తి చేసి రిలీజ్ చేస్తారా? ప‌్ర‌స్తుతం ప్ర‌పంచ‌వ్యాప్తంగా అభిమానుల్లో ఉన్న సందేహ‌మిది. దీనికి ఆర్.ఆర్.ఆర్ టీమ్ నుంచి ఆన్స‌ర్ రావ‌డం అంత సులువేమీ కాద‌ని అర్థ‌మ‌వుతోంది.

కేవ‌లం ఒక భారీ యాక్ష‌న్ సీక్వెన్స్ కోస‌మే రాజ‌మౌళి 50 రోజుల స‌మ‌యం తీసుకున్నార‌న్న నిజం ఆలోచింపజేస్తోంది. ఈ మూవీలో అలాంటి మ‌హోన్న‌త‌మైన యాక్ష‌న్ ఘ‌ట్టాలు ఎన్ని ఉంటాయి?  వాటికి  విజువ‌ల్ గ్రాఫిక్స్ .. ఎఫెక్ట్స్ వ‌ర్క్ ఎంత ఉంటుంది? అన్న‌ది కూడా రిలీజ్ తేదీని డిసైడ్ చేస్తుంద‌ని అంచ‌నా వేస్తున్నార‌.

ప్ర‌స్తుతం రామ్ చ‌ర‌ణ్ - అలియా.. తార‌క్ -ఒలివియా కలయికలో సన్నివేశాలు సహా చిత్రీకరించాల్సిన అనేక కీల‌క విభాగం ఇంకా అలానే మిగిలి ఉందిట‌. ఎన్టీఆర్ పార్ట్ ఏప్రిల్ నాటికి పూర్తయితే.. ప్రణాళిక ప్రకారం ప్రతిదీ జరిగితే జూన్ లేదా జూలై 2021 విడుదల సాధ్యం అవ్వొచ్చ‌న్న అంచ‌నా వేస్తున్నార‌. అయితే ఇది ఇంకా అంత సులభం కాదు. నిర్మాణానంత‌ర ప‌నుల్లోనూ రాజీకి రాని జ‌క్క‌న్న అక్క‌డా ఎక్కువ స‌మ‌యం తీసుకునేందుకు ఆస్కారం లేక‌పోలేదు. బెస్ట్ ఔట్ పుట్ వచ్చేవరకు అత‌డు అంగీక‌రించే త‌త్వం ఉన్న‌వాడు కాదు. అందుకే  పోస్ట్-ప్రొడక్షన్ పనులు ఆలస్యం అవ్వ‌డం ఖాయ‌మ‌ని భావిస్తున్నారు.

కోవిడ్ మ‌హ‌మ్మారీ దెబ్బ‌కు గ్రాఫిక్ కంపెనీలకు మానవవ‌న‌రుల స‌మ‌స్య‌లు ఉన్నాయ‌న్న చ‌ర్చా సాగుతోంది. ఇంకా పూర్తిస్థాయిలో తమ పనిని ప్రారంభించనందున RRR పురోగతిపై పెద్ద‌ ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. జక్కన్నకు మాట ఇచ్చిన గడువు ప్ర‌కారం..పూర్తి చేయ‌డానికి కంపెనీలు సిద్ధంగా లేవని అనిశ్చితి ఇంకా అలానే ఉందని తెలుస్తోంది. ఇక వ‌చ్చే స‌మ్మ‌ర్ క‌ష్ట‌మే గ‌నుక ద‌స‌రా కి అయినా రాక‌పోతే  అటుపై 2022 సంక్రాంతి వ‌ర‌కూ ఈ మూవీని రిలీజ్ చేయ‌క‌పోవ‌చ్చ‌న్న భావ‌నా నెల‌కొంది.

ఇంతటి భారీ చిత్రం పెట్టుబడుల్ని పూర్తి స్థాయిలో తిరిగి రాబ‌ట్టాలంటే లాంగ్ ర‌న్ ని దృష్టిలో పెట్టుకుని రిలీజ్ చేయాల్సి ఉంటుంది కాబ‌ట్టి ప్ర‌తిదీ ప‌క్కాగానే ప్లాన్ చేయాల్సి ఉంటుంది. పండ‌గ సెల‌వులే డబ్బు సంపాదించగల ఏకైక పెద్ద సీజన్. అది దృష్టిలో పెట్టుకునే దాన‌య్య అండ్ టీమ్ ప్లాన్ చేస్తార‌నడంలో సందేహ‌మేం లేదు.
Tags:    

Similar News