రోజా సెటైర్‌!..బాబు ఫ్ర‌స్టేష‌న్ పీక్స్ కెళ్లింద‌ట‌!

Update: 2017-08-21 11:19 GMT
నంద్యాల ఎన్నిక‌లు ఏపీ సీఎం చంద్ర‌బాబులో రోజురోజుకు టెన్ష‌న్ పెంచుతున్నాయి. ప్రచారం కూడా చివ‌రి ద‌శ‌కు చేరుకోవ‌డంతో.. చివ‌రి రెండు రోజులు నంద్యాల‌లో మ‌కాం వేశారు. త‌న‌తో ఉన్న‌ప్పుడు ఒక‌లా.. వెళిపోతే మ‌రొక‌లా మాట్లాడ‌టం ఆయ‌న‌కు వెన్న‌తో పెట్టిన విద్య‌! గ‌తంలో భూమా నాగిరెడ్డిని తీవ్రంగా దూషించిన ఆయ‌నే.. ఇప్పుడు ప్లేట్ పిరాయించారు. మొన్న‌టివ‌ర‌కూ మంచోడుగా అనిపించిన శిల్పా మోహ‌న‌రెడ్డిపై.. ఇప్పుడు విషం క‌క్కుతూ రెండు నాలుక‌ల ధోర‌ణి బ‌య‌ట‌పెడుతూనే ఉన్నారు. ప్ర‌స్తుతం ఈ అంశాల‌న్నింటినీ వివ‌రిస్తూ వైసీపీ ఎమ్మెల్యే రోజా ప్ర‌చారంలో దూసుకుపోతున్నారు. చంద్ర‌బాబు రెండు నాలుక‌ల సిద్ధాంతాన్ని బ‌లంగా ప్ర‌జ‌ల్లోకి తీసుకెళుతున్నారు.

నంద్యాల ప్ర‌చారంలో రోజా చురుగ్గా పాల్గొంటూ.. ఏపీ సీఎం చంద్ర‌బాబుపై సెటైర్లు వేస్తూ ఓట‌ర్ల‌ను ఆక‌ర్షిస్తున్నారు. ప్రాస‌ల‌తో కూడిన డైలాగుల‌తో ఆక‌ట్టుకుంటున్నారు. సీఎం చంద్రబాబు ఫ్రస్టేషన్‌ పీక్‌ స్టేజికి చేరిందని సెటైర్లు వేశారు. అందుకే ఓటమి భయంతో శిల్పా మోహన్‌ రెడ్డిపై ఆరోపణలు చేస్తున్నారని విమ‌ర్శించారు. నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె మాట్లాడుతూ.. `నిన్నటివరకూ శిల్పా మోహన్‌ రెడ్డి మంచోడు అన్నారు. టీడీపీ నుంచి వైఎస్‌ ఆర్‌ సీపీలో చేరగానే విమర్శలు చేస్తున్నారు. గతంలో భూమా నాగిరెడ్డిని విష వృక్షం అన్న చంద్రబాబు ఇప్పుడు అదే భూమాను పొగుడుతున్నారు.` అంటూ ఎండ‌గ‌ట్టారు.

మామను వెన్నుపోటు పొడిచినప్పుడు ఎన్టీఆర్‌ ను ఇలానే విమర్శించార‌ని గుర్తుచేశారు. మైనార్టీల అభివృద్ధి గురించి చంద్రబాబు మాట్లాడటం హాస్యాస్పదమ‌న్నారు.  మైనార్టీలకు వైఎస్‌ రాజశేఖరరెడ్డి మూడు మంత్రి పదవులు ఇచ్చారు. చంద్రబాబు ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వలేదు. చంద్రబాబుకు దమ్ముంటే పార్టీ ఫిరాయించిన 21మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు రావాల‌ని స‌వాల్ విసిరారు. అవినీతి పాలనకు ఓట్లు రావు కాబట్టే..నంద్యాలలో రూ.కోట్లు పంపిణి చేసి కొనాలనుకుంటున్నార‌ని ధ్వజమెత్తారు.
Tags:    

Similar News