రాజధాని తరలింపు.. రోజా చెప్పిన నిజాలు

Update: 2020-01-12 10:33 GMT
ఏపీ రాజధాని అమరావతిని విశాఖకు తరలిస్తున్నారని ప్రచారం జరుగుతుండడం.. 3 రాజధానులపై జగన్ సర్కారు వడివడిగా ముందుకెల్తుండడం.. మరోవైపు అమరావతి ప్రాంత రైతులు నిరసనలతో హోరెత్తుస్తుండడంతో ఈ వ్యవహారం ఏపీలో రాజకీయంగా సెగలు పుట్టిస్తోంది.

ఈ నేపథ్యంలోనే తాజాగా ఆదివారం తిరుపతిలో మాట్లాడిన వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్మన్ రోజా హాట్ కామెంట్స్ చేశారు. అసలు రాజధాని తరలిస్తున్నామని చంద్రబాబుకు ఎవరు చెప్పారు? ఆయన ప్రజలను రెచ్చగొడుతున్నారని రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. రాయలసీమ ద్రోహీ చంద్రబాబు అంటూ ఆరోపించారు.

కర్నూలు రాజధానిగా కావాలని అన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు మాట ఎందుకు మార్చాడని.. బీజేపీ నేతలు ఎందుకు యూటర్న్ తీసుకున్నారని రోజా ప్రశ్నించారు. అమరావతి రాజకీయాల్లోకి మహిళలను లాగిన చంద్రబాబు తీరును మహిళా కమిషనే కడిగేసిందని రోజా ధ్వజమెత్తారు. మూడు రాజధానులను ప్రజలంతా హర్షిస్తున్నారని.. అన్ని ప్రాంతాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమన్నారు.

    

Tags:    

Similar News