కేసుల వంశీ.. ఫ్యూచర్ కొలాప్సేనా.. ?
ఒకటి కాదు.. రెండు కాదు.. పదుల సంఖ్యలో వైసీపీ నాయకులకు కేసుల ఉచ్చు బిగుసుకుంటోంది.;
ఒకటి కాదు.. రెండు కాదు.. పదుల సంఖ్యలో వైసీపీ నాయకులకు కేసుల ఉచ్చు బిగుసుకుంటోంది. బలమైన నాయకులు.. అధికారంలో ఉన్నప్పుడు.. తర్వాత కూడా.. చేసిన పనుల కారణంగా... కేసుల ఊబిలో దిగిపోయారు. ప్రస్తుతం గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై వరుసగా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. తాజాగా సునీల్ అనే వ్యక్తి.. గతంలో తనను అపహరించి.. చేయి చేసుకున్నట్టు చెప్పారు. దీం తో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇది.. వంశీకి మరో ఇబ్బందికర పరిణామంగా మారింది.
ప్రస్తుతం వంశీ అంతో ఇంతో యాక్టివ్ అయ్యారు. నియోజకవర్గంలో తిరుగుతున్నారు. గత ప్రాభవాన్ని తిరిగి తెచ్చుకునే ప్రయత్నం కూడాచేస్తున్నారు. అయితే.. అనూహ్యంగా ఇప్పుడు మరో కేసు నమోదు కావడం.. పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉందన్న చర్చ జరుగుతున్న నేపథ్యంలో వంశీ ఫ్యూచర్ ఏంటన్నది ప్రశ్నగా మారింది. అయితే.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు లేకపోయినా.. ఇప్పటి నుంచి తన గ్రాఫ్‌ను బిల్డప్ చేసుకునేందుకు ప్రయత్నించాల్సిన అవసరం ఉంది.
కానీ, ఇప్పుడు వరుస కేసులు చుట్టుముడుతున్న నేపథ్యంలో వంశీకి ఆ అవకాశం లేకుండా పోయే ప్రమా దం ఏర్పడిందన్న చర్చ సాగుతోంది. మరోవైపు.. కమ్మ సామాజిక వర్గం పూర్తిగా వంశీని పక్కన పెట్టిందన్న చర్చ జరుగుతోంది.వాస్తవానికి వంశీ ఎదుగుదలకు.. కమ్మ సామాజిక వర్గం కీలక రోల్ పోషించింది. అయి తే.. వారిని కాదని.. వైసీపీలోకి చేరిన తర్వాత.. ఆ వర్గం దాదాపు వంశీకి దూరమైంది. ఇక, చంద్రబాబు కుటుంబంపై చేసిన వ్యాఖ్యలు, నారా లోకేష్‌ను విమర్శించిన తీరు వంటివి మరింతగా వంశీని డైల్యూట్ చేశాయి.
దీనికి తోడు కేసులు కూడా చుట్టుముట్టాయి. ఈ పరిణామాలతో వంశీ.. ఇప్పుడిప్పుడే.. వారిని చేరువ చేసు కునే ప్రయత్నంలో ఉన్నారు. ఇలాంటి సమయంలో మరోసారి కేసు నమోదు కావడం.. అరెస్టు భయం వెంటాడుతుండడం.. కమ్మ వర్గంలోనూ వంశీపై ఇంకా సానుభూతి లేకపోవడం వంటి పరిణామాలతో వంశీ ఫ్యూచర్ కొలాప్సేనా? అనేది చర్చగా మారింది. మరోవైపు గన్నవరం నియోజకవర్గంలో రాజకీయాలు మారుతున్నాయి. ఇది కూడా.. వంశీకి సెగ పెంచుతోంది. సో.. ఎలా చూసినా వంశీ ఫ్యూచర్ ఇబ్బందిగానే ఉందని అంటున్నారు పరిశీలకులు.