ఓటీటీ అదనపు హింసకు కోర్టు ముకుతాడు
సబ్ స్క్రైబర్లకు చుక్కలు చూపించడానికి ఏదో ఒక స్కీమ్ వేయడంలో ఓటీటీల తర్వాతే. ఇటీవల అమెజాన్ ప్రైమ్ పెయిడ్ ప్రైమ్ వీడియో సర్వీస్‌లో ప్రకటనలను ప్రసారం చేయడం ప్రారంభించింది.;
సబ్ స్క్రైబర్లకు చుక్కలు చూపించడానికి ఏదో ఒక స్కీమ్ వేయడంలో ఓటీటీల తర్వాతే. ఇటీవల అమెజాన్ ప్రైమ్ పెయిడ్ ప్రైమ్ వీడియో సర్వీస్‌లో ప్రకటనలను ప్రసారం చేయడం ప్రారంభించింది. ప్రతి 3గంటల సినిమాకు గంటకు ఒకసారి 6 నిమిషాల నిడివితో ప్రకటనలు వేస్తోంది. అంటే సినిమా పూర్తయ్యేప్పటికి 18 ని.లు ప్రకటనలు చూడటానికే ప్రేక్షకులకు కళ్లప్పగించాలి.
నిజానికి బుల్లితెరకు భిన్నంగా ఓటీటీల్లో అయినా కనీసం ప్రకటనల రహితంగా సినిమాలు, కంటెంట్ ని చూడాలని వీక్షకులు ఆశపడుతున్నారు. కానీ అది ఇప్పుడు సాధ్యపడటం లేదు. దీనివల్ల ప్రేక్షకుడి విలువైన సమయం అంతా కైంకర్యం అయిపోతోంది. అమెజాన్ ప్రైమ్ చాలా దేశాలలో కంటెంట్ ని ప్రకటనల సహితంగా పుల్ చేసింది. ఇది వీక్షకులకు తలనొప్పి వ్యవహారంగా పరిణమించింది.
అయితే జర్మనీలో మాత్రం ఇందుకు విరుద్ధంగా అమెజాన్ ప్రైమ్ కోర్టు సమస్యల్ని ఎదుర్కొంటోంది. ముందస్తు ఒప్పందం ప్రకారం ప్రకటనలు లేకుండా కంటెంట్ ని అందించాల్సి ఉంది. కానీ అమెజాన్ ప్రైమ్ ప్రకటనలు రాకుండా నివారించడానికి నెలకు అదనంగా రూ.3 వసూలు చేస్తుంది. అయితే ఇది చట్టవిరుద్ధమైన చర్య అంటూ జర్మనీలోని మ్యూనిచ్ కోర్టు తీర్పును వెలువరించింది. నియమాన్ని ఉల్లంఘిస్తే దానిని వినియోగదారులకు తెలియజేయాలి. కానీ అమెజాన్ ప్రైమ్ అలా చేయడంలో విఫలమైంది.
ప్రైమ్ ఇలాంటి విరుద్ధమైన పనులతో క్షణ దశలో ఉంది! అంటూ న్యాయమూర్తులు సైతం వ్యాఖ్యానించారు. నిజానికి ప్రకటనల రహితంగా కంటెంట్ ని అందిస్తామని చెప్పిన తర్వాతే సబ్ స్క్రిప్షన్లను ప్రారంభించిన అమెజాన్ ప్రైమ్ ఇలా చేయడం సరికాదు అని కోర్టు తాఖీదులు వేసింది. అలాగే అమెజాన్ కస్టమర్లకు పంపిన ఇమెయిల్‌ను కూడా న్యాయమూర్తులు విమర్శించారు. ఇలాంటి తప్పుదారి పట్టించే చర్యలు సరికాదని హెచ్చరించింది కోర్టు. అయితే వినియోగదారు నుంచి అదనంగా వసూలు చేసిన మొత్తాన్ని తిరిగి వెనక్కి పంపాల్సిన పని లేకపోయినా కానీ, కమ్యూనికేషన్ పరంగా తప్పు దారి పట్టించేదిగా ఉందని, దీనిని సరిదిద్దాల్సి ఉందని కోర్టు తీర్పును ఇచ్చింది. అయితే అమెజాన్ ప్రైమ్ దీనిని వ్యతిరేకిస్తూ..తదుపరి పైకోర్టులో విచారణకు అప్పీల్ చేయనుందని సమాచారం. అయితే దీని ప్రభావం భారతదేశంలోని ప్రైమ్ నెట్ వర్క్ పై పడుతుందా? యాప్‌లను తొలగించాలా వద్దా? అన్న చర్చ సాగింది.