ఉన్నావ్ కస్టడీ డెత్ కేసు.. కుల్దీప్‌ సెంగర్‌ కు ఢిల్లీ హైకోర్టులో బిగ్ షాక్!

ఉత్తరప్రదేశ్‌ లోని ఉన్నావ్‌ ప్రాంతానికి చెందిన ఓ మైనర్‌ బాలికను కిడ్నాప్‌ చేసి, అత్యాచారానికి పాల్పడిన ఘటన 2017లో దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.;

Update: 2026-01-19 22:30 GMT

ఉత్తరప్రదేశ్‌ లోని ఉన్నావ్‌ ప్రాంతానికి చెందిన ఓ మైనర్‌ బాలికను కిడ్నాప్‌ చేసి, అత్యాచారానికి పాల్పడిన ఘటన 2017లో దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. ఆ బాధితురాలి తండ్రి 'కస్టడీ' మృతి కేసు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఈ కేసులో బీజేపీ బహిష్కృత నేత కుల్దీప్‌ సింగ్‌ సెంగర్‌ కు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. ఈ కేసులో పదేళ్ల శిక్షను నిలిపివేయాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ ను ఉన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 3కి వాయిదా వేశారు.

అవును... ఉన్నావ్‌ అత్యాచార ఘటనకు సంబంధించి బాధితురాలి తండ్రి ‘కస్టడీ’ మృతి కేసులో బిగ్ అప్ డేట్ తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా.. బహిష్కృత నేత కుల్దీప్‌ సింగ్‌ సెంగర్‌ కు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. ఈ కేసులో పదేళ్ల శిక్షను నిలిపివేయాలంటూ ఆయన దాఖలు చేసిన ఆయన పిటిషన్‌ తోసి పుచ్చిన న్యాయస్థానం... శిక్ష విషయంలో ఉపశమనం కల్పించేందుకు సరైన కారణాలు లేవని పేర్కొంది. దీంతో ఈ విషయం తాజాగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

వాస్తవానికి.. ఉన్నావ్‌ అత్యాచార కేసులో కుల్దీప్‌ సెంగర్‌ దోషిగా తేలి, జీవిత ఖైదు అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. ఇటీవల ఈ శిక్షను నిలిపివేస్తూ.. ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. షరతులపై బెయిల్‌ మంజూరు చేసింది. దీంతో... ఈ తీర్పుపై సీబీఐ అధికారులు, బాధితురాలి తరఫు న్యాయవాదులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ సమయంలో బాధితురాలి తరుపున పలు స్వచ్ఛంద సంస్థలు నిలబడ్డాయి. హస్తిన వేదికగా ఈ ఇష్యూ జాతీయ మీడియాలో బ్యానర్ ఐటం అయ్యింది.

ఈ సమయంలో... సుప్రీంకోర్టు డిసెంబర్ 23, 2025న ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను నిలిపివేసింది. ఇది సెంగర్ జీవిత ఖైదును నిలిపివేసింది. హైకోర్టు ఆదేశం ప్రకారం అతన్ని విడుదల చేయరాదని పోలీసు శాఖను ఆదేశించింది.

కాగా... 2017లో కుల్దీప్‌ సింగ్‌ సెంగర్‌ ఉత్తర్‌ ప్రదేశ్‌ లోని ఉన్నావ్‌ ప్రాంతానికి చెందిన ఓ మైనర్‌ బాలికను కిడ్నాప్‌ చేసి, అత్యాచారానికి పాల్పడ్డాడు. 2018 ఏప్రిల్‌ లో ఆమె తండ్రి పోలీసు కస్టడీలో మృతి చెందాడు. ఈ క్రమంలో సెంగర్‌ ను డిసెంబర్ 2019లో ట్రయల్ కోర్టు దోషిగా నిర్ధారించింది. అతనికి జీవిత ఖైదు విధించబడింది. ఈ సందర్భంగా స్పందించిన న్యాయమూర్తి... ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజా సేవకుడిగా సెంగర్ ప్రజా విశ్వాసాన్ని మోసం చేశాడని.. ఒక దుర్మార్గపు చర్యకు పాల్పడ్డాడని తెలిపారు.

2018 ఏప్రిల్ 3న, మైనర్ అత్యాచార బాధితురాలి కుటుంబం ఉన్నావ్ కోర్టు విచారణ కోసం వెళ్ళినప్పుడు.. ఆమె తండ్రి సురేంద్రపై నిందితులు పట్టపగలు దారుణంగా దాడి చేశారు. ఈ క్రమంలో.. అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్నారనే ఆరోపణలపై మరుసటి రోజు పోలీసులు సురేంద్రను అరెస్టు చేశారు. కస్టడీలో ఉన్నప్పుడు, దాడి సమయంలో అనేక గాయాలతో అతను 2018 ఏప్రిల్ 9న మరణించాడు.

Tags:    

Similar News