జనరేషన్ బీటా.. 2025లో ఈ గ్రహంపైకి ఎంతమంది వచ్చారంటే..!

ఈ కాలక్రమంలో మరికొన్ని రోజుల్లో మరో ఏడాది ముగిసిపోబోతోంది.. సరికొత్త ఏడాది రాబోతోంది.;

Update: 2025-12-20 01:30 GMT

ఈ కాలక్రమంలో మరికొన్ని రోజుల్లో మరో ఏడాది ముగిసిపోబోతోంది.. సరికొత్త ఏడాది రాబోతోంది. వేగంగా మారిపోయిన ఈ కాల ప్రవాహంలో పుట్టేవారు పుడుతుంటే.. మరణించేవారు మరణిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో జనరేషన్ బీటాలో భాగమైన 2025లో కొత్తగా ప్రపంచ వ్యాప్తంగా జన్మించిన వారి వివరాలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఈ విషయంలో భారత్ టాప్ ప్లేస్ లో నిలిచింది.

అవును... ఈ ప్రపంచం 2025లో ఇప్పటివరకూ భారీ సంఖ్యలో జననాలనే చూసింది. ఈ క్రమంలో దీనికి భారత్ నాయకత్వం వహించగా.. ఆ తర్వాత స్థానాల్లో చైనా, నైజీరియా, పాకిస్థాన్, ఇండోనేషియా ఉన్నాయి. ఇక అగ్రరాజ్యం అమెరికా 8వ స్థానంలో నిలిచింది. ఈ ఏడాది అత్యధిక జనాభా వృద్ధి ఆసియా, ఆఫ్రికాలలోనే కేంద్రీకృతమై ఉంది. ఈ సందర్భంగా ఆ వివరాలు ఇప్పుడు చూద్దామ్..!

తాజా పరిస్థితుల ప్రకారం ఈ ఏడాది చివరి నాటికి 2.3 కోట్ల జననాలతో భారతదేశం ప్రపంచవ్యాప్తంగా అగ్రస్థానంలో ఉంటుందని అంచనా వేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా జరిగే జననాలలో 17% భారత్ లోనే జరుగుతాయని.. అయితే, 2050 నాటికి ఈ వాటా 14%కి తగ్గుతుందని అంచనా వేయబడింది. భారత్ తర్వాత స్థానంలో 2025నాటికి 87 లక్షల జననాలతో చైనా తర్వాత స్థానంలో ఉంది.

అయితే 2050 నాటికి ఇది ప్రపంచవ్యాప్తంగా జననాల విషయంలో నాల్గవ స్థానానికి పడిపోతుందని.. దీంతో, నైజీరియా, పాకిస్థాన్ రెండూ దీని రెండో స్థానం కోసం పోటీ పడతాయని అంచనా వేస్తున్నారు. ఇక అగ్రరాజ్యం అమెరికా విషయానికొస్తే.. ఈ ఏడాది జననాలు 37 లక్షల నుంచి 2050 నాటికి 38 లక్షలకు స్వల్పంగా మారతాయని అంచనా వేస్తున్నారు.

ఈ సందర్భంగా దేశాల వారీగా టాప్ - 10 జననాల అంచనాలు ఈ విధంగా ఉన్నాయి...

1. భారత్ - 2.3 కోట్లు

2. చైనా - 87 లక్షలు

3. నైజీరియా - 76 లక్షలు

4. పాకిస్థాన్ - 69 లక్షలు

5. కాంగో - 46 లక్షలు

6. ఇండోనేషియా - 44 లక్షలు

7. ఇథియోఫియా - 42 లక్షలు

8. యునైటెడ్ స్టేట్స్ - 37 లక్షలు

9. బంగ్లాదేశ్ - 34 లక్షలు

10. బ్రెజిల్ - 25 లక్షలు

Tags:    

Similar News