బంగాళాఖాతంలోనూ భారత్ ను గిల్లిన బంగ్లా.. తెరపైకి షాకింగ్ ఘటన!
గత కొన్ని రోజులుగా భారత్ వ్యతిరేక వాక్ చాతుర్యం బంగ్లాదేశ్ లో బలంగా వినిపిస్తూ అది రోజు రోజూకీ తీవ్రంగా మారుతోన్న పరిస్థితి నెలకొన్న సంగతి తెలిసిందే.;
గత కొన్ని రోజులుగా భారత్ వ్యతిరేక వాక్ చాతుర్యం బంగ్లాదేశ్ లో బలంగా వినిపిస్తూ అది రోజు రోజూకీ తీవ్రంగా మారుతోన్న పరిస్థితి నెలకొన్న సంగతి తెలిసిందే. దీంతో.. బంగ్లాదేశ్ అంతటా భూమిపై భారత వ్యతిరేక నిరసనలు చెలరేగుతున్నాయి. మరోవైపు సముద్రంలో కూడా ఉద్రిక్తతలు చెలరేగడం ఇప్పుడు సంచలనంగా మారింది. దీంతో.. ముందు ముందు ఎలాంటి పరిణామాలు నెలకొంటాయనేది కీలకంగా మారింది.
అవును.. ఓ పక్క బంగ్లాదేశ్ అంతా భూమిపై భారత వ్యతిరేక నిరసనలు చెలరేగుతుండగా.. సముద్రంలో కూడా అలజడులు మొదలయ్యాయి. ఇందులో భాగంగా.. బంగాళాఖాతంలోని భారత జలాల్లోకి బంగ్లాదేశ్ ఫిషింగ్ ఓడల అనధికారిక ఎంట్రీ పెరిగిపోతోంది. ఈ క్రమంలో బంగ్లాదేశ్ నావికాదళానికి చెందిన గస్తీ నౌక.. 16 మంది మత్స్యకారులతో ప్రయాణిస్తున్న భారతీయ ట్రాలర్ ను ఢీకొట్టింది. దీంతో.. అది బోల్తా పడింది.
దీంతో పరిస్థితులు ఒక్కసారిగా తీవ్రమయ్యాయి. బంగ్లాదేశ్ నేవీ నౌక బెంగాల్ కు చెందిన 16 మంది మత్స్యకారులతో ప్రయాణిస్తున్న భారత ట్రావెలర్ ను సముద్ర సరిహద్దు సమీపంలో ఢీకొట్టింది. ఆ సమయంలో బంగ్లా నౌక లైట్లు ఆపివేయబడిందని, దీంతో రాత్రి పూట భారత ట్రాలర్ దాన్ని గుర్తించడం అసాధ్యం అయ్యిందని అంటున్నారు. వాస్తవానికి ఈ ఘటన సోమవారమే జరగ్గా తాజా పరిణామాల నడుమ వెలుగులోకి వచ్చింది.
బంగ్లా నౌక ఢీకొట్టడంతో భారత ట్రాలర్ పడవ బోల్తా పడిపోయింది. దీంతో భారత మత్స్యకారులంతా సముద్రంలో పడిపోయారు. ఈ నేపథ్యంలో ఉదయం 6 గంటల ప్రాంతంలో భారత తీర రక్షక దళం 11 మంది మత్స్యకారులను రక్షించగలగగా.. మిగిలిన ఐదుగురి ఆచూకీ ఇప్పటికీ కనిపించలేదని చెబుతున్నారు. జాతీయ మీడియా కథనాల ప్రకారం అందులో ఒక మత్స్యకారుడిని ఈటె వంటి ఆయుధంతో చంపారంట!
ఈ సందర్భంగా... మా అందరినీ చంపడానికి ప్రయత్నం జరిగిందని.. తాము వల వేయడానికి సిద్ధమవుతుండగా బంగ్లా నౌక ట్రాలర్ ను ఢీకొట్టిందని.. ఈ సమయంలోనే రాజ్ దుల్ అలీ అనే వ్యక్తిని ఈటె తో చంపారని ప్రాణాలతో బయటపడిన ఓ మత్స్యకారుడు చెప్పినట్లు కథనాలొస్తున్నాయి. ఈ సమయంలో ఫిషర్మెన్ వర్కర్స్ యూనియన్ ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఏది ఏమైనా గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు, ఇక.. గురువారం రాత్రి నుంచి జరుగుతున్న తీవ్ర పరిణామాలు.. పైగా వచ్చే ఏడాది అక్కడ సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. బంగ్లాదేశ్ – భారత్ మధ్య ఎలాంటి ఘటనలు చోటు చేసుకుంటాయనేది చర్చనీయాంశంగా మారింది.