ముఖ్య‌మంత్రికి కొత్త పేరు.. సారా చంద్ర‌బాబు

Update: 2017-06-24 11:05 GMT
వైసీపీ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే రోజా మ‌ళ్లీ జోరు పెంచారు. ఆమె వైసీపీని వీడుతార‌ని ప్ర‌చారం జ‌రుగుతున్న‌వేళ అదంతా అవాస్త‌వ‌మంటూ నిరూపించుకునే రీతిలో వైసీపీ త‌ర‌ఫున గ‌ళం విప్పారు. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుపై ఆమె త‌నదైన శైలిలో విరుచుకుప‌డ్డారు. నారావారి నరకాసుర పాలనలో ఆడవారికి రక్షణ లేకుండా పోయిందంటూ ఆమె దుమ్ము దులిపేశారు.

హైదరాబాద్‌ లోటస్‌ పాండ్‌ లోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో రోజా శనివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ధనార్జనే లక్ష్యంగా చంద్ర‌బాబు ప్ర‌భుత్వం మద్యం పాలసీ చేసిందంటూ ఏకిపారేశారు. మద్యం విధానాల వల్ల ఆడవాళ్ల జీవితాలు బల‌వుతున్నాయ‌ని.. నారా చంద్రబాబు తన పేరును సారా చంద్రబార్‌ నాయుడిగా మార్చుకోవాల‌ని సూచించారు.
 
కొత్త మ‌ద్యం పాల‌సీతో వంద‌ల కోట్లు వ‌సూలు చేశార‌ని.. మంచినీళ్లు ఇవ్వక‌పోయినా మద్యం మాత్రం ఇస్తున్నార‌ని ఆమె ఆరోపించారు. మద్యం పాలసీ ద్వారా వచ్చిన డ‌బ్బులో చంద్ర‌బాబు - లోకేశ్ లు వాటాలు తీసుకుంటున్నార‌ని ఆరోపించారు. అందులో సీఎం - లోకేశ్‌ వాటా ఎంత? అని ప్ర‌శ్నించారు. చంద్రబాబు కంటే సిగ్గుమాలిన సీఎం ఇంకెవ‌రూ లేర‌ని మండిప‌డ్డారు. మ‌ద్యం పాల‌సీని.. తాగుబోతులంతా  కూర్చుని తీసుకున్న నిర్ణ‌యంగా ఆమె అభివ‌ర్ణించారు. ఓ వైపు పిల్లల‌ను ఇబ్బందులు పెడుతూ స్కూళ్ల‌ను మూసేస్తున్నార‌ని.. అదే స‌మ‌యంలో బార్ల త‌లుపుల‌ను బార్లా తెరిచేస్తున్నార‌ని ఆమె మండిపడ్డారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News