• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  లక్షకు ఒక్కరు కూడా...

లక్షకు ఒక్కరు కూడా తగ్గదన్నారు.. పర్మిషన్ పదివేలమందికేనా?

By - Tupaki Desk
Update: 2021-08-10 02:44 GMT
అనుకున్నట్లే ఇంద్రవెల్లి సభను భారీగా నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తన సత్తా చాటారు. పెద్ద ఎత్తున ప్రజల్ని తరలించేందుకు జరిగిన ప్రయత్నాలు ఫలించాయి. మండే ఎండతోపాటు.. తీవ్రమైన ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నా.. లెక్క చేయకుండా సభకు హాజరయ్యేలా చూసుకోవటం.. లక్షకు ఒక్కరు కూడా తగ్గరు. ఒకవేళ తగ్గితే తల వంచుతానన్న ఆయన మాటలు సంచలనంగా మారటం తెలిసిందే.

ఇదిలా ఉంటే.. సభకు వచ్చిన వారిని పోలీసులు అడ్డుకుంటున్నారని ఘాటుగా రియాక్టు అయ్యారు. సభా స్థలికి పది కిలోమీటర్లపైనే ఆపేశారని.. సభకు అడ్డురాకుండా నిలిపే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు. దీనిపై తాజాగా పోలీసులు రియాక్టు అయ్యారు. ఇంద్రవెల్లిలో నిర్వహించిన సభకు మూడు రోజులుగా అన్ని రకాలుగా బందోబస్తు నిర్వహించామని.. అయినప్పటికి విమర్శలు చేస్తారా? అంటూ పోలీసులు అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కాంగ్రెస్ కార్యకర్తల్ని పోలీసులు అడ్డుకున్నారంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేయటం సరికాదన్న  నల్గొండ జిల్లా ఇన్ ఛార్జి ఎస్పీ ఎం.రాజేశ్ చంద్ర మాట్లాడుతూ.. సభకు కేవలం పదివేల మంది మాత్రమే హాజరవుతారని.. అందుకు తగ్గట్లు అనుమతులు పొందారన్నారు. తమకు పర్మిషన్ అడిగిన దానికి మించి తరలింపు జరిగినా.. తాము మాత్రం భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు. ఇకపై ఎవరైనా పోలీసులపై అవాస్తవ ఆరోపణలు చేస్తే కేసులు నమోదు చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. అయినా.. లక్షకు ఒక్కరు కూడా తగ్గరంటూ మాట్లాడిన రేవంత్.. పోలీసుల పర్మిషన్ ను మాత్రం పది వేల మందికే పరిమితం చేయటం ఎందుకంటారు రేవంత్?
Tags:    
  • Telangana Congress Committee chief 
  • Enumula Revanth Reddy 
  • Huzurabad 
  • Political News 
  • Breaking News 
  • Latest News 
  • bypolls 
  • revanth reddy 

Similar News

పార్టీలు, ఫంక్షన్లు జరగాలంటే ఆ రూల్స్ పాటించాలా?

2026-11-19 16:30 GMT

చంద్రబాబు దెబ్బకు తమిళనాడులో అలజడి!? ఏపీకి డేటా లీక్, 15 మందిపై వేటు! నిజమేనా?

2026-11-19 15:30 GMT

ఆ ఒక్క తప్పు చేస్తే మళ్లీ కష్టాలే : ప్రధాని మోదీ హెచ్చరిక.. తినడం, తిరగడం, తాగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-19 14:30 GMT

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

Copyright @2026

Powered by Blink CMS