ఆ సంస్థలకి వ్యతిరేకంగా NGT చెన్నైలో రేవంత్ పిటిషన్.. ఏ ఏ సంస్థలపై అంటే ?

Update: 2020-09-30 17:33 GMT
హైదరాబాద్ లోని పుప్పాల గూడ లో నాలాను ఆక్రమించి భారీ నిర్మాణాలు చేశారని ఆరోపణలు చేస్తూ జాతీయ హరిత ట్రైబ్యునల్‌ చెన్నై లో మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి పిటిషన్ వేశారు. GO 111 సహా బిల్డింగ్ రూల్స్ 2012కు విరుద్ధంగా 30 అంతస్తుల భవనాలు నిర్మించారని జాతీయ హరిత ట్రైబ్యునల్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఆర్థిక, రాజకీయ బలం ఉన్న బడా సంస్థలు డిఎల్ ఎఫ్, మైహోంమ్ సంస్థలు నిబంధనలు ఉల్లంఘించాయని పిటిషన్ లో పొందుపరిచారు.

పిటిషన్ పరిశీలించిన జస్టిస్ రామకృష్ణన్ నేతృత్వంలోని ద్విసభ్య బెంచ్ కేంద్ర పర్యావరణ శాఖ, తెలంగాణ సాగునీటి శాఖ, కాలుష్య నియంత్రణ మండలి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సహా డిఎల్ ఎఫ్, మైహోమ్ సంస్థలకు నోటీసులు జారీ చేసింది NGT. వాస్తవ పరిస్థితులు తెలుసుకునేందుకు రంగారెడ్డి జిల్లా కలెక్టర్, కేంద్ర పర్యావరణ శాఖ రీజినల్ ఆఫీసర్, చెరువుల పరిరక్షణ కమిటీలతో సంయుక్త కమిటీ ఏర్పాటు చేసింది. మరో రెండు నెలల్లో దీనిపై సమగ్ర విచారణ చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీచేసింది.
Tags:    

Similar News