తెలంగాణ రెబ‌ల్ ఫ్రంట్‌..ఇది కాంగ్రెస్‌ కు పోరాట వేదిక‌

Update: 2018-11-16 13:38 GMT
కాంగ్రెస్‌ పార్టీపై తిరుబాటు మొదలైంది. పార్టీని నమ్ముకొని పనిచేసిన తమను కాదని ఇత‌రుల‌కు టికెట్లు అమ్ముకున్నారని తిరుగుబాటు నాయకులు ఆరోపిస్తున్న సంగ‌తి తెలిసిందే. దీనికి తోడుగా అన్ని ఆధారాలు తమ వద్ద ఉన్నాయని సరైన సమయంలో వాటిని బయట పెడతామని చెపుతున్నారు. .ఈ మేరకు  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 40 సీట్లలో  ఒకే గుర్తు పై టికెట్లు రాని నేతలమంతా పోట చేస్తున్నామని నేతలు వెల్లడించారు. తాజాగా ఏకంగా పార్టీనే ఏర్పాటుచేశారు.

శుక్రవారం సోమాజిగూడ ప్రెస్‌ క్లబ్‌ లో మాజీ మంత్రి విజయరమణారావు - రవీందర్‌ - రాజీవ్‌ లతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ రెబల్స్‌ ఫ్రంట్‌(టీఆర్‌ ఎఫ్‌) ఏర్పాటు చేశామని మాజీ మంత్రి బోడ జనార్ధన్ ప్ర‌క‌టించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ ఓడిపోతే పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డిదే బాధ్యత అని అన్నారు. గెలవాల్సిన వారిని వదిలేసి స‌త్తాలేని వారికి టికెట్లు ఇచ్చారని ఆరోపించారు. పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి - మల్లు భట్టి విక్రమార్క - ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి కుంతియాలు మాహాకూటమి పేరుతో మహా మాయ చేశారన్నారు.  ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చిన తరువాత కూడ లీస్ట్‌ విడుదల చేయకుండా జాప్యం చేశారన్నారు. 12వ తేదీ నామినేషన్లు వేసే రోజు విడుదల చేసిన మొదటి జాబితా  చూసి తెలంగాణ నాలుగు కోట్ల ప్రజలు ఇదేమి జాబితా అని నిలదీశారన్నారు.  కాంగ్రెస్‌ పార్టీ విడుదల చేసిన జాబితాపై ఢిల్లీలో - రాహుల్‌ గాంధీ ఇంటి ముందు ధర్నాలు జరిగాయని - గాంధీ భవన్‌ దద్ధరిల్లిందన్నారు.  ఒక్క నెలలో పార్టీలో చేరిన 19 మందికి - గతంలో మూడు సార్లు ఓడిపోయిన  8 మందికి  టికెట్లు ఇచ్చారన్నారు. వాస్తవంగా రాహుల్‌ గాంధీ ఈ జాబితాను పెండింగ్‌ లో పెట్టాలని ఆదేశిస్తే - పీసీసీ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి రాహుల్‌ నిర్ణయానికి వ్యతిరేకంగా  వ్య‌వ‌హ‌రించార‌ని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ నేతలు టికెట్లు అమ్ముకున్నారని, దీని వల్ల సభ్యత్వం లేని వారికి - నిన్నమొన్న పార్టీలో చేరిన వారికి టికెట్లు ఇచ్చారన్నారు చేసిన పని వల్ల రాష్ట్రంలో  టీఆర్‌ ఎస్‌ ప్రభుత్వం ఏర్పడే అవకాశాలు ఏర్పాడ్డాయని తెలిపారు.

Tags:    

Similar News