• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  అసలు రోహిత్ ను ఎందుకు...

అసలు రోహిత్ ను ఎందుకు సస్పెండ్ చేశారు?

By - Tupaki Desk
Update: 2016-01-20 05:14 GMT
సెంట్రల్ యూనివర్సిటీ పీహెచ్ డీ విద్యార్థి రోహిత్ ఆత్మహత్య వ్యవహారం ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద సంచలనంగా మారింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకుంటే.. ఎందుకింత వివాదంగా మారింది? లాంటి విషయాల్ని కాసేపు పక్కన పెట్టి.. అసలు రోహిత్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు? దానికి కారణం ఏమిటి? రోహిత్ ఆత్మహత్య వెనుక కేంద్రమంత్రుల హస్తం ఉందా? లాంటి ప్రశ్నలకు సమాధానం వెతకాలంటే మరికొన్ని ప్రశ్నలు వేసుకుంటే విషయం అంతా అర్థమవుతుంది.

రోహిత్ ఆత్మహత్యకు కారణం అతన్ని వర్సిటీ నుంచి సస్పెండ్ చేయటంగా చెబుతున్నారు. మరి.. అతన్ని ఎందుకు సస్పెండ్ చేశారు? సస్పెండ్ చేసేంత తప్పు రోహిత్ లాంటి విద్యార్థి ఏం చేశాడన్న విషయంలోకి వెళితే.. ఆ మధ్యన ముంబయి పేలుళ్ల కేసులో ఉరిశిక్ష పడిన యాకూబ్ మెమన్ కు  ఉరి వేసిన సంగతి తెలిసిందే. దీన్ని కొందరు వ్యతిరేకించారు. అలా వ్యతిరేకించిన వారిలో రోహిత్ ఒకడు.

అయితే.. అభిప్రాయ బేధాలు అక్కడితో ఆగిపోలేదు. సెంట్రల్ యూనివర్సిటీలో చదువుతున్న ఏబీవీపీ సంస్థకు చెందిన సుశీల్ యాకూబ్ మెమన్ ఉరితీతను సమర్థించాడు. దీనిపై సోషల్ మీడియాలో కామెంట్ పెడితే.. అతనిపై అంబేడ్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ కు చెందిన 30 మంది విద్యార్థులు సుశీల్ మీద దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. అతివాద వైఖరి ఉన్న ఈ సంస్థకు చెందిన వాడే రోహిత్ ఒకడు. యాకూబ్ మెమన్ ఉరితీతను బలంగా సమర్థించటంతో పాటు.. ఏబీవీపీ సభ్యులపై దాడికి పాల్పడిన వారికి నేతృత్వం వహించిన వారిలో రోహిత్ ఒకడు. ఈ అంశమే అతనిపై వర్సిటీ చర్యలు తీసుకునేలా చేసింది. వందలాది మంది ప్రాణాలు తీసిన ముంబయి పేలుళ్ల కేసులో దోషి అయిన వ్యక్తికి రోహిత్ లాంటి పీహెచ్ డీ స్కాలర్ సమర్థించటం ఏమిటి? పేలుళ్ల కారణంగా మరణించిన అమాయకులెవరూ రోహత్ కు గుర్తుకు రారా? వారు మనుషులు కాదనుకున్నాడా? లాంటి ప్రశ్నల్ని పలువురు సంధిస్తున్నారు.
Tags:    
  • Rohith 
  • HCU 
  • Telugu NEws 

Similar News

బ్యూరోక్రాట్స్ హిట్ కొట్టలేకపోతున్నారు..రీజన్ అదే ?

2026-11-04 18:30 GMT

కోస్తా గేట్ తాకని వైసీపీ...సేమ్ సీన్ రిపీట్

2026-11-04 18:03 GMT

విశాఖ డిప్యూటీ మేయర్ మీద బీజేపీ కర్చీఫ్ ?

2026-11-04 18:01 GMT

ఎన్టీఆర్ ఆత్మ గౌరవ నినాదం...కేటీఆర్ కామెంట్స్ వెనక ?

2026-11-04 18:01 GMT

బ్యాలెట్ పేపర్లే.. కానీ కౌంటింగ్ మాత్రం రాకెట్ స్పీడ్.. అమెరికా ఎన్నికల్లో అసలు టెక్నాలజీ ఇదే..

2026-11-04 18:00 GMT

భారత్, చైనా సహా ఈ నాలుగు దేశాలకు హార్మూజ్ ను ఓపెన్ చేసిన ఇరాన్.. కానీ ట్విస్ట్

2026-11-04 17:52 GMT

పవన్ ఇలాకాలో ఏంటీ తేడా...బిగ్ నంబర్ తోనే !

2026-11-04 17:46 GMT

జగన్ బాస్...ఓడించింది బోస్ !

2026-11-04 16:15 GMT

రేవంత్ బయటపెట్టిన ‘ది గ్రేట్ ఫైనాన్షియల్’ మార్వలస్ ఐడియా

2026-11-04 13:15 GMT

రేవంత్ గెలవడని కేటీఆర్ డిసైడ్.. ఆ భూములు కొనొద్దని పారిశ్రామికవేత్తలకు హెచ్చరిక

2026-11-04 13:10 GMT

పాపం ష‌ర్మిల‌.. ఇంత హ‌ర్ట్ అవుతార‌నుకోలేదా ..?

2026-11-04 13:01 GMT

మాజీ ఐపీఎస్‌.. ఓట‌మి స్ఫూర్తి.. !

2026-11-04 13:00 GMT

Copyright @2026

Powered by Blink CMS