ఆర్ బీఐ సంచలన రికార్డు.. ప్రపంచంలో మరెవరికీ లేదట
షార్ట్ కట్ లో ఆర్ బీఐగా.. ఫుల్ ఫాంలో చెప్పాలంటే రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియాగా సుపరిచితమైన సంస్థ తాజాగా సరికొత్త రికార్డును సొంతం చేసుకుకుంది. ప్రపంచంలో మరే సెంట్రల్ బ్యాంక్ సాధించలేని ఘనతను ఆర్ బీఐ సాధించినట్లు చెబుతున్నారు. ఇంతకీ ఆ రికార్డు ఏమంటే.. ఆర్ బీఐ ట్విట్టర్ హ్యాండిల్ 10 లక్షల మంది ఫాలోవర్లను సాధించింది.
ప్రపంచంలోని మరే సెంట్రల్ బ్యాంకు ఈ తరహా ఫాలోవర్లు లేకపోవటం గమనార్హం. ప్రపంచంలోనే వన్ మిలియన్ ఫాలోవర్లు ఉన్న ఏకైక సెంట్రల్ బ్యాంక్ గా ఆర్ బీఐ అవతరించింది. ఈ సందర్భంగా ఆర్ బీఐ సిబ్బందిని అభినందించారు ఆర్ బీఐ గవర్నర్ శక్తికాంత దాస్. ‘ఇదో మైలురాయి. ఆర్ బీఐలోని నా సహచరులకు అభినందనలు’ అంటూ ఆయన పేర్కొన్నారు.
ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన యూఎస్ ఫెడరల్ రిజర్వ్.. యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ ట్విట్టర్ ఖాతాలకు లేని ఫాలోవర్లు ఆర్ బీఐకి ఉండటం విశేషం. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగాఆర్ బీఐ కు పదిలక్షల ఐదు వందల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇదిలా ఉంటే.. ఆర్ బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ కు 1.37లక్షల ఫాలోవర్లు ఉన్నారు.