ఎవరీ దేవ సహాయం.. ఎందుకు దేవసహాయం

Update: 2022-05-16 16:30 GMT
ప్రపంచంలో అతిపెద్ద మతమైన క్రైస్తవంలో అత్యంత అరుదైన గుర్తింపు సెయింట్ హుడ్. ఇదేమంత సునాయాసంగా రాదు. ఎన్నో ప్రక్రియలు, వడపోతల అనంతరం ప్రకటిస్తారీ సెయింట్ హుడ్ ను. భారత్ లో అందరికీ తెలిసి సెయింట్ హుడ్ పొందిన వ్యక్తి మదర్ థెరిస్సా. యుగోస్లావియాలో పుట్టి సేవనే పరమార్థంగా వచ్చి కోల్ కతా మురికివాడల్లో దీనజనోద్ధరణకు జీవితాన్ని అంకింత చేశారామె.అందుకే ఎందరికో "మదర్" అయ్యారు మదర్ థెరిస్సా. గొప్ప వ్యక్తులు సైతం ఆమె సేవలను ఎంతగానో పొగిడేవారు. అయితే, ఆ తర్వాతి కాలంలో సెయింట్ హుడ్ దక్కినవారి మనకు పెద్దగా పరిచయం లేనివారో, లేక ఎన్నడో చనిపోయినవారో అయి ఉన్నారు.

తాజాగా తమిళనాడు వ్యక్తికి..తాజాగా తమిళనాడుకు చెందిన దేవసహాయం పిళ్లైకు సెయింట్ హుడ్ లభించింది. అది కూడా ఆయన చనిపోయిన 270 ఏళ్లకు కావడం విశేషం. పిళ్లైది తమిళనాడులోని  కన్నియాకుమారి జిల్లా నట్టాలం. ఒకప్పుడు అంటే ఓ 300 ఏళ్ల కిందట ఈ ప్రాంతం ట్రావెన్ కోర్ సంస్థానం పరిధిలో ఉండేది.

పిళ్లైది.. హిందూ కుటుంబం. నాయర్ల సామాజిక వర్గం. తర్వాతి కాలంలో క్రైస్తవ మతాన్ని స్వీకరించారు. అంతేకాదు.. హిందూ మతంలో వేళ్లూనుకున్న కులతత్వంపై అప్పట్లోనే పోరాడారు. మత స్వేచ్ఛకు అంతగా స్వేచ్ఛ లేని ఆ కాలంలో వ్ర కష్టాలు ఎదురైనా క్రైస్తవానికే కట్టుబడ్డారు. దేవుని సేవకే అంకితమయ్యారు.

జీవించింది 40 ఏళ్లే..దేవసహాయం పిళ్లై 1712 ఏప్రిల్‌ 23న జన్మించారు. అసలు పేరు నీలకంఠన్‌ నాయర్‌. అప్పటి ట్రావెన్‌కోర్‌ సంస్థానంలో మత మార్పిడులు నిషేధం. అయితే, 33 ఏళ్ల వయసులో 1745లో దేవసహాయం డచ్‌ నౌకాదళ కమాండర్‌ బెనెడిక్టస్‌ ప్రభావంతో క్రైస్తవ మతాన్ని స్వీకరించారు. దేవసహాయం పిళ్లై పేరును లాజర్‌స్ గా మార్చుకున్నారు. దీంతో ట్రావెన్ కోర్ సంస్థానాధీశుడు ఆగ్రహానికి గురయ్యారు. దేవసహాయాన్ని ఊరూరాతిప్పుతూ  చిత్రహింసలకు గురిచేశారు. అయినప్పటికీ దేవ సహాయం తిరిగి హిందూమతంలోకి రాలేదు. చివరకు ట్రావెన్ కోర్ సంస్థాన సైన్యం అతడిని 1752 జనవరి 14న చంపేసింది.

తొలిసారిగా అవివాహుతుడికి.. దేవసహాయం పిళ్లై వివాహం చేసుకున్నారు. క్రైస్తవం చరిత్రలో వివాహితుడికి సెయింట్‌ హుడ్‌ లభించడం ఇదే ప్రథమం కావడం విశేషం. అంతేకాదు.. . భారత్‌కు చెందిన ఓ సామాన్యుడికి క్రైస్తవంలో అత్యంత అరుదైన గుర్తింపు, గౌరవం అయిన సెయింట్‌ హోదా దక్కడం ఇదే తొలిసారి కావడం విశేషం.

సుమారు 270 ఏళ్ల క్రితం మరణించిన దేవసహాయం (లాజర్‌స)ను పోప్‌ ఫ్రాన్సిస్‌ సెయింట్‌ హుడ్‌ (మహిమాన్విత వ్యక్తి)గా ప్రకటించారు వాటికన్‌ సిటీలోని సెయింట్‌ పీటర్స్‌ చర్చి ప్రాంగణంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో పోప్‌ ఫ్రాన్సిస్‌.. దేవసహాయంతోపాటు మరో తొమ్మిది మందికి సెయింట్‌హుడ్‌ను ప్రకటించారు. ఈ కార్యక్రమానికి తమిళనాడు మంత్రులు సెంజి మస్తాన్‌, మనోతంగరాజ్‌ కూడా హాజరయ్యారు.
Tags:    

Similar News