• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  తెలంగాణ ప్రభుత్వం మరో...

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం..ఇంటింటికీ ర్యాపిడ్‌ ఫీవర్‌ సర్వే!

By - Tupaki Desk
Update: 2020-04-06 07:50 GMT
కరోనా వైరస్ తెలంగాణ రాష్ట్రంలో వేగంగా విస్తరిస్తుంది. మొదట్లో కరోనా కొంత కంట్రోల్ లోకి వచ్చింది అని అనుకున్నప్పటికీ మర్కజ్ ఘటన బయటపడిన తరువాత రోజురోజుకి కరోనా పాజిటివ్  కేసులు ఎక్కువైపోతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా పాజిటివ్‌ కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పోలీసు శాఖ ఆధ్వర్యంలో కార్డన్‌ ఆఫ్‌ వంటివి నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం పాజిటివ్‌ గా వెల్లడైన వారిని ఐసోలేషన్‌ కేంద్రాలకు - సోకేందుకు అనుమానం ఉన్న వారిని ట్రావెల్‌ హిస్టరీ ఆధారంగా - కరోనా బాధితులను కలిసి ఉండటం వంటి అంశాలతో హోమ్‌ క్వారంటైన్‌ లో ఉంచడమో లేక ప్రభుత్వ క్వారంటైన్‌ లకు తరలించడం వంటివి చేస్తున్నారు.

అలాగే, పాజిటివ్‌ కేసులున్న వారి ఇళ్ల చుట్టుపక్కల కిలోమీటరు పరిధి వరకు వైద్యశాఖ బృందాలతో ఇంటింటికీ ర్యాపిడ్‌ ఫీవర్‌ సర్వే చేయనున్నారు. ఈ సర్వే ఆధారంగా జ్వరం - జలుబు - ఇతరత్రా  కరోనా లక్షణాలున్నట్లు అనుమానాలుంటే వారి రక్త నమూనాలని తీసుకోని - ప్రభుత్వ ఆస్పత్రుల్లోని పరీక్షా కేంద్రాలకు పంపించి ఎంతమందికి కరోనా పాజిటివ్‌ ఉన్నదీ తెలుసుకుంటారు. ఇలా ఒకే ప్రాంతంలో పాజిటివ్‌ కేసులు ఎక్కువగా ఉన్నట్లయితే, ఆప్రాంతంలోని వారు ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా - ఇతరప్రాంతాల వారు ఆ ప్రాంతంలోకి రాకుండా పోలీసులు నిర్వహించే కార్డన్‌ ఆఫ్‌ వంటివి చేపట్టే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు  తెలుస్తుంది.

అలాగే, ఒకే ప్రాంతంలో పది అంతకంటే ఎక్కువ పాజిటివ్‌ కేసులున్న ప్రాంతాలను హాట్‌ స్పాట్‌ లుగా  గుర్తించనున్నారు. ఇలా గుర్తించిన హాట్ స్పాట్ ల వద్ద మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకోనున్నారు. అయితే ఎన్ని కరోనా పాజిటివ్ కేసులు ఒకే దగ్గర ఉంటే - వాటిని హాట్‌ స్పాట్లుగా గుర్తించాలనే అంశంపై ఇంకా ఒక్క స్పష్టతకి రాలేదు. ఇక కరోనా కట్టడి కార్యక్రమాలు పకడ్బందీగా నిర్వహించేందుకు ముఖ్యమంత్రి ఆదేశాలకి  అనుగుణంగా చీఫ్‌ సెక్రటరీ సోమేశ్‌ కుమార్‌ రాత్రి - పగలు అన్న తేడా లేకుండా నిత్యం పోలీస్ - వైద్య అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. అలాగే మర్కజ్‌ సంబంధీకులున్న ప్రాంతాల జియోట్యాగింగ్‌ పనులు వేగంగా చేస్తున్నారు.
Tags:    
  • Rapid Fever Survey In Telangana 
  • Coronavirus in Telangana 
  • Telangana 
  • Telangana News 
  • Telangana Politics 
  • Telangana Political Updates 
  • Hyderabad 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

చంద్రబాబు దెబ్బకు తమిళనాడులో అలజడి!? ఏపీకి డేటా లీక్, 15 మందిపై వేటు! నిజమేనా?

2026-11-19 15:30 GMT

ఆ ఒక్క తప్పు చేస్తే మళ్లీ కష్టాలే : ప్రధాని మోదీ హెచ్చరిక.. తినడం, తిరగడం, తాగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-19 14:30 GMT

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

ఏపీలో అన్ని పార్టీల‌కు ఇదే స‌మ‌స్యా... వార్నింగ్‌ల‌తో స‌రా..?

2026-11-19 10:03 GMT

Copyright @2026

Powered by Blink CMS