• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ప్రియాంకా గాంధీకి ఊహించని...

ప్రియాంకా గాంధీకి ఊహించని ప్రశంసలు

By - Tupaki Desk
Update: 2016-04-29 07:33 GMT
హార్డుకోర్ బీజేపీ అభిమాని ఒకరి నుంచి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ కుమార్తె ప్రియాంకకు ఊహించని రీతిలో ప్రశంసలు వచ్చాయి. ప్రియాంకను ప్రశంసించిన వ్యక్తి ఇంకెవరో కాదు, యోగా గురు బాబా రాందేవ్. కాంగ్రెస్ పేరెత్తితే విరుచుకుపడే రాందేవ్ ఎవరూ ఊహించని రీతిలో ప్రియాంక గాంధీకి మంచి సర్టిఫికెట్ ఇచ్చారు. ప్రియాంకలో భారతీయత కనిపిస్తుందని ఆయన కితాబిచ్చారు. అయితే... అదే సమయంలో ప్రియాంక సోదరుడు - కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని మాత్రం రాందేవ్ వేస్టని తేల్చేశారు. రాహుల్ కు చాలా అవకాశాలు వచ్చాయని ఆయన ఏమాత్రం ఉపయోగించుకోలేకపోయారని అన్నారు.

రీసెంటుగా ఓ ఛానల్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో బాబా రాందేవ్ పలు ఆసక్తికర అంశాలు చెప్పారు.  2014 సార్వత్రిక ఎన్నికలు జరగడానికి ఆరు నెలల ముందే తాను బీజేపీ విజయాన్ని ఊహించి చెప్పానని... తన మాట నిజమైందని అన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తుందని చెప్పడమే కాకుండా మోడీ నాయకత్వంలో 300కు పైగా స్థానాలు గెలుచుకుంటారని కూడా తాను ముందుగానే చెప్పానని రాందేవ్ చెప్పారు.

రాహుల్ గాంధీ విషయంపైనా మాట్లాడిన ఆయన రాహుల్ లోని లోపాలను చెబుతూ ఆయన ప్రతిపక్ష నేతగా మరింత ధృఢంగా ఉంటే తప్ప రాణించలేరని అన్నారు.  రాహుల్ బలపడితే బలమైన ప్రతిపక్షం ఉంటుందని... ప్రజాస్వామ్యంలో బలమైన విపక్షం ఉంటే మంచిదేనని అన్నారు. రాహుల్ ఆ విషయంలో అట్టర్ ప్లాఫయ్యారని రాందేవ్ అభిప్రాయపడ్డారు.
Tags:    
  • Ramdev Baba 
  • Priyanka Gandhi 
  • Telugu NEWs 

Similar News

పెళ్లి కోసం 7 వేల మంది క్యూ.. ఇంత కరువులో ఉన్నారేంట్రా సామీ

2026-11-03 16:30 GMT

మీరు గెలిచినా, ఓడినా ఎవరికీ పట్టదు.. వైరల్ అవుతున్న బిజినెస్‌మ్యాన్ ట్వీట్!

2026-11-03 15:30 GMT

తిండి క‌ల్తీ.. నెయ్యి క‌ల్తీ.. స‌మాజం క‌ల్తీ.. లైసెన్సులు ర‌ద్దు చేస్తున్న FDA

2026-11-03 14:30 GMT

వాసిరెడ్డి ప‌ద్మ వార‌సురాలి విజ‌యం!

2026-11-03 12:30 GMT

అదృష్టం తలుపుతట్టింది.. వైసీపీ అభ్యర్థికి లాటరీలో విజయం దక్కింది..

2026-11-03 12:22 GMT

గోదావ‌రి జిల్లాల్లో జ‌న‌సేన జోరు!

2026-11-03 11:30 GMT

ఒక‌వైపు ముర‌సు.. మ‌రోవైపు కౌంటింగ్‌.. ఊపిరాడితే ఒట్టు!

2026-11-03 10:56 GMT

ఈ పోలింగ్ ఫ‌స్ట్ ఎపిసోడ్‌... ఏం నేర్పుతోంది.. !

2026-11-03 10:55 GMT

ప్ర‌క్షాళ‌న త‌ప్ప‌దా.. అంతా అయ్యాక ఇదే హాట్ టాపిక్‌.. !

2026-11-03 10:30 GMT

ఇక బెట్టింగులు.. ఎవ‌రికోస‌మంటే.. !

2026-11-03 10:04 GMT

బిగ్ అప్టేట్ : రాప్తాడు నిందితుడి కాలు తొలగింపు..

2026-11-03 09:35 GMT

ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో కూటమి హవా.. వైసీపీకి భారీ దెబ్బ

2026-11-03 08:54 GMT

Copyright @2026

Powered by Blink CMS