రాందేవ్ ను సెక్సుకు ఇన్వైట్ చేసిన హీరోయిన్

Update: 2015-11-29 11:30 GMT
రాందేవ్ బాబా ఎంత ఫేమస్ యోగా గురువో ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు.. ఆయన సంస్థ పతంజలికి చెందిన ఉత్పత్తులు ఇప్పుడు ఇంటింటా కనిపిస్తున్నాయి. బాబా చేసే యోగాకు ఫ్లాటయిపోయిందో లేదంటే ఫిట్ గా ఉండే ఆయన బాడీని చూసి పడిపోయిందో కానీ ఒక హీరోయిన్ మాత్రం రాందేవ్ కు ఫ్లాటయిపోయిందట. అంతేకాదు... 'నా సర్వస్వం అర్పించుకుంటాను, ఎంజాయ్ చేద్దాం రా స్వామీ' అని పిలిచిందట. అయితే.. ఆమె ఆఫర్ కు బాబా ఏమాత్రం టెంప్టవకుండా మెల్లగా అక్కడి నుంచి జారుకున్నారట. తప్పనుకున్నారో... తప్పించుకోవాలనుకున్నారో.. తన వల్ల కాదనుకున్నారో కానీ బాబా మాత్రం ఆ బంపర్ ఆఫర్ ను వదులుకున్నారట. రీసెంటుగా ఓ టీవీ చానల్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న బాబా ఈ సంగతి చెప్పారు. ఓ ప్రోగ్రాంలో పాల్గొన్నప్పుడు తనతో పాటు ఆ హీరోయిన్ కూడా ఆ కార్యక్రమానికి వచ్చిందని.. అప్పుడా సంఘటన జరిగిందని చెప్పారు. ఒక సారి అమెరికాలోనూ ఒక మహిళ వచ్చి ఇలాంటి బంపర్ ఆఫరే ఇచ్చినా నో చెప్పేశానని అననారు. తాను సర్వ సుఖాలను త్యజించి సన్యాసి అయిన తరువాత జరిగిన సంఘటన ఇదని.. ఆమే కాదు, చాలా మంది అమ్మాయిలు తనకు ప్రపోజ్ చేశారని బాబా చెప్పారు. అయితే... ప్రస్తుతం తనకు గర్ల్ ఫ్రెండ్స్ ఎవరూ లేరని బాబా అంటున్నారు. అంటే గతంలో ఉన్నట్లేనన్నమాట.

పనిలో పనిగా బాబా అమీర్ ఖాన్ పై విమర్శలు కురిపించారు. దేశంలో అసహనం ఉందంటున్న ఆయనపై మండిపడ్డారు. అసహనమే ఉంటే అమీర్, కిరణ్ రావుల పెళ్లి జరిగేది కాదని... కిరణ్ కు అలాంటి భయమే ఉంటే ఆమె అమీర్ ను పెళ్లాడేదే కాదని ఆయన అన్నారు.
Tags:    

Similar News