గుడ్ లక్ కృపమ్మా....రాజ్యసభ ప్రాప్తిరస్తూ...?
ఆమె వృత్తిపరంగా డాక్టర్. దానికి తోడు ఆమె సామాజిక సేవా కార్యక్రమాలను చేపడుతూ శ్రీకాకుళం జిల్లాలో మంచి పేరు తెచ్చుకున్నారు. దాంతో 2004లో వైఎస్సార్ కిల్లి కృపారాణిని పిలిచి మరీ ఎంపీగా పోటీ చేయించారు. నాడు ఆమె ఓడినా 2009లో మాత్రం సిక్కోలు సింహం దివంగత నేత కింజరాపు ఎర్రన్నాయుడునే ఓడించి మొత్తం ఏపీ దృష్టిని ఆకర్షించారు. అదే టెర్మ్ లో ఆమె కేంద్ర మంత్రిగా కూడా కొంతకాలం పనిచేశారు.
ఇక 2014 నాటికి జగన్ తన పార్టీలో చేరమని ఆహ్వానం పంపినా కాంగ్రెస్ కి కట్టుబడి ఎంపీగా పోటీ చేసి ఓడారు. 2019 నాటికి మాత్రం వైసీపీ జెండా పట్టుకున్నారు. కానీ జగన్ ఆమెకు ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు ఇవ్వలేదు. పార్టీ కోసం పనిచేయమన్నారు. అధికారంలోకి వస్తే న్యాయం చేస్తామని చెప్పారు.
అలా మూడేళ్ళ కాలం గడచింది. శ్రీకాకుళం జిల్లా వైసీపీ ప్రెసిడెంట్ గా కిల్లి కృపారాణి పనిచేస్తున్నారు. పార్టీ పటిష్టతకు ఆమె బాగా పాటుపడుతున్నారు. ఈ నేపధ్యంలో రాజ్యసభ సీట్లు నాలుగు ఏపీలో ఖాళీ అవుతున్నాయి. అందులో ఒకటి ఆమెకు దక్కుతుందా అన్న చర్చ అయితే ఉంది. వైసీపీ సర్కార్ హయాంలో ఇదే చివరి విడత రాజ్యసభ పదవుల భర్తీ. బంపర్ మెజారిటీతో వైసీపీ అసెంబ్లీలో ఉండడంతో ఈసారి ఖాళీ అయ్యే నాలుగు సీట్లూ ఆ పార్టీ ఖాతాలో పడతాయి.
దాంతో రాజ్యసభ సీట్లకు రకరకాల పేర్లు వినిపిస్తున్న క్రమంలో కృపారాణి లేటెస్ట్ గా జగన్ని స్వయంగా కలసి వచ్చారు. ఆమెను చూస్తూనే జగన్ గుడ్ లక్ కృపా అని అన్నారని అనుచరులు చెబుతున్నారు. ఆమెకు తగిన న్యాయం చేస్తామని, శ్రీకాకుళం జిల్లాలో పార్టీని బాగా పటిష్టం చేయాలని కూడా కోరారని సమాచారం.
ఇక శ్రీకాకుళం జిల్లాలో అతి పెద్ద సామాజిక వర్గంగా ఉన్న కాళింగ వర్గానికి చెందిన కృపారాణి ఉన్నత విద్యావంతురాలు. ఇక బీసీ మహిళగా ఉన్న ఆమె రాజ్యసభకు ఎంపిక అయితే వైసీపీ తరఫున ఫస్ట్ టైమ్ ఆ కోటాలో పెద్దలకు సభకు వెళ్ళేది ఆమె మాత్రమే అవుతారు. అన్నివిధాలుగా కృపారాణికి రాజ్యసభ ఎంపీగా ఎంపిక అయ్యే అర్హతలు ఉన్నాయని ఆమె అనుచరులు అంటున్నారు.
ఉత్తరాంధ్రా జిల్లాల సమస్యలతో పాటు ఏపీ సమస్యలు సభలో ప్రస్తావించాలన్నా, ఢిల్లీలో కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవంతో పాటు ఆమెకు విరివిగా ఉన్న పరిచయాలు వైసీపీకి ఉపయోగపడాలన్నా కృపారాణిని ఎంపిక చేయడమే సబబు అని పార్టీ నేతలు అంటున్నారు. మరి జగన్ ఆమెకు గుడ్ లక్ చెప్పారు. రాజ్యసభ యోగం ఉందా అంటే వెయిట్ అండ్ సీ.