పెమ్మసాని పేరు చెప్పకుండానే అంబటి రాంబాబు కుమార్తె కీలక వ్యాఖ్యలు!
ఏపీ సీఎం చంద్రబాబుపై ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలతో ఆగ్రహం చెందిన కార్యకర్తలు.. నిప్పులు చెరిగారు. ఈ నేపథ్యంలో అంబటి రాంబాబు చిన్న కుమార్తె శ్రీజ స్పందిస్తూ.. కీలక వ్యాఖ్యలు చేశారు.;
ఇటీవల మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై టీడీపీ శ్రేణులు దాడికి దిగిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఇంటిని, వాహనాలను ధ్వంసం చేశారు. ఇదే సమయంలో ఆయన కార్యాలయాన్ని ముట్టడించారు. మరోవైపు ఆయనకు బయట ఉంటే రక్షణ ఉండదనే కారణంతో అరెస్టు చేసి, రాజమండ్రి జైలుకు తరలించారు! ఈ సమయంలో తమ ఇంటిపై దాడి అంతా ఓ డాక్టర్, కేంద్రమంత్రి కనుసన్నల్లోనే జరిగిందంటూ అంబటి రాంబాబు కుమార్తె కీలక వ్యాఖ్యలు చేశారు.
అవును.. ఇటీవల అంబటి రాంబాబు ఇళ్లు, ఆఫీసు, వాహనాలపై టీడీపీ శ్రేణులు దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఏపీ సీఎం చంద్రబాబుపై ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలతో ఆగ్రహం చెందిన కార్యకర్తలు.. నిప్పులు చెరిగారు. ఈ నేపథ్యంలో అంబటి రాంబాబు చిన్న కుమార్తె శ్రీజ స్పందిస్తూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా.. టీడీపీ వాళ్లు తమ ఇంటిపై దాడి చేసినా కానీ.. నిన్న వేలమంది అభిమానంతో తమ ఇంటికి వచ్చారని అన్నారు.
ఈ సందర్భంగా దేవుడే తమకు రక్షణ కవచంలా ఉంటారని.. తమ ఇంటిపై అత్యంత దారుణంగా అటాక్ చేశారని.. ఉదయం గుడికి వెళ్లిన తమ తండ్రిపై టీడీపీ వాళ్లు దాడి చేశారని.. కర్రలతో వచ్చి అంబటి రాంబాబుపై దాడి చేశారని.. టీడీపీ మహిళలు బూతులతో ఆయనను తిట్టారని.. ఆ సమయంలో ఆయన అలా మాట్లాడారని.. అనంతరం ఇంటికి వచ్చిన తర్వాత రియలైజ్ అయ్యి, ఆ మాట తాను అని ఉండకూడదని పశ్చాత్తాపం చెందారని తెలిపారు.
రాజకీయాలతో సంబంధం లేని తమ సిస్టర్స్ ని కూడా దారుణంగా తిడుతూ అటాక్ చేశారని.. కుల ప్రస్థావన కూడా తీసుకొచ్చి, దానికి బూతులు జోడించి తిట్టారని శ్రీజ తెలిపారు. ఈ నేపథ్యంలో... ఈ మొత్తం ఎపిసోడ్ ని ఒక డాక్టర్ అయిన కేంద్రమంత్రి నడిపించడం దారుణమని.. ఆయనకున్న మేథస్సు ఆయన్ని సరైన మార్గంలో పెట్టలేదా అని అనిపిస్తోందని.. అంబటి రాంబాబుని వేధించి రాక్షసానందం పొందారని అన్నారు.
ఇది అక్కడితో అయిపోలేదని.. అనంతరం రాంబాబుని అరెస్ట్ చేశారని.. మీరు బయట ఉంటే భద్రత లేదు అనే కారణంతో అరెస్ట్ చేశారని.. నాలుగు గోడల మధ్య బంధించి, కాళ్లు చేతులూ పట్టుకుని ఫిజికల్ గా హింసించారని తెలిపారు! ఆయన ఒక మాజీ మంత్రి అయినప్పటికీ.. ఆయనకు ఆ గౌరవం ఇవ్వడం మీకు ఇష్టం లేకపోయినా.. కనీసం ఆయన ఓ సీనియర్ సిటిజన్ అని అయినా ఆయనకు గౌరవం ఇవ్వాలని వారికి లేదని అన్నారు!
అయితే.. రోజులన్నీ ఎప్పుడూ ఒకేలా ఉండవని.. నాలుగూ రోజుల క్రితం తమ ఇంటిపైన దాడికి ఎంతమంది జనాలు వచ్చారో.. అంతకు పదింతల మంది మద్దతుగా వచ్చారని తెలిపారు. ఆ రోజు దాడి సమయంలో ఇంట్లోని కిటీకీల అద్దాలు, తలుపులూ పగిలాయని.. అయితే తాజాగా గోడలే పగిలిపోయాయని తెలిపారు! జగన్ తమ ఇంటికి వచ్చి, అన్ని విషయాలు స్పష్టంగా మాట్లాడారని.. తమకు అండగా నిలబడ్డారని అన్నారు!
ఏది ఏమైనా.. అంబటి రాంబాబు ఎపిసోడ్ మొత్తం ఒక డాక్టర్ అయిన కేంద్రమంత్రి కనుసన్నల్లో జరిగిందంటూ ఆమె పెమ్మసాని చంద్రశేఖర్ పేరు ప్రస్థావించకుండా కామెంట్ చేయడం మాత్రం సంచలనంగా మారింది!